AP Government : బిగ్ బ్రేకింగ్.. ఏపీలో సంక్రాంతి సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు…!
AP Government : సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు ఆరు షోలు పర్మిషన్ ఇచ్చింది. ఐతే ఈ విషయంపై హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించగా ఆ జీవో ని ఇప్పుడు సవరణ చేశారు. సంక్రాంతి సినిమాల సందడి బాగా ఉంటుంది కాబట్టి ఏపీలో ఈ వారం రోజుల పాటు రిలీజ్ అవుతున్న 3 సినిమాలకు ఆరు షోల పర్మిషన్ ఇచ్చారు.
అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు ఒక షో ప్లాన్ చేశారు. ఐతే ఆ టైం లో భద్రతా ఏర్పాట్లు కష్టమని భావించి హైకోర్టు దీన్ని సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐతే దీన్ని ప్రభుత్వం సవరిస్తూ ఐదు షోలకే పర్మిషన్ ఇచ్చారు. ఐతే ఉదయం ఆట బెనిఫిట్ షోగా ఎర్లీ అవర్స్ లో వేసుకునే అవకాశం ఇచ్చారు.
AP Government ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయానికి..
ఐతే ఈమధ్య కొన్ని పరిణాలా వల్ల ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయానికి వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అర్ధరాత్రిళ్లు షో వేయడం వల్ల అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం మళ్లీ సినిమా టైమింగ్స్ లో మార్పు చేసింది. ఈ నిర్ణయం ప్రజల క్షేమం కోసమే తీసుకున్నా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. AP Government, Pongal Movies, Sankranthi, Game Changer, Daku Maharaj , Sankrathiki Vastunnam