AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు రద్దు చేసుకోబోతున్నారా..!
ప్రధానాంశాలు:
AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు రద్దు చేసుకోబోతున్నారా..!
AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ Ar Rahman -సైరా బాను ల విడాకుల ప్రకటనతో యావత్తు సంగీత ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. వాళ్లిద్దరూ తమ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని తెలియజేస్తూ.. తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. ఊహించని కారణాల వల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. అయితే విడాకుల ప్రకటన జరిగిన చాలారోజుల తర్వాత సైరా భాను రెహమాన్‌కి థాంక్స్ చెప్పింది.

AR Rahman Couple : ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు రద్దు చేసుకోబోతున్నారా..!
AR Rahman Couple రద్దు చేసుకుంటారా..
వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా సైరా బాను Saira Bhanuకి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె న్యాయవాది వందనా షా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన రెహమాన్‌తోపాటు ఆత్మీయులకు సైరా ధన్యవాదాలు తెలిపింది. ”కొన్ని రోజుల క్రితం నేను ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరాను.
ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన నా మాజీ భర్త ఏ.ఆర్. రెహమాన్, సౌండ్ డిజైనర్ రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, అలాగే తన న్యాయవాది Lawyer వందనా షా.. లాస్ ఏంజెల్స్‌లోని నా స్నేహితులకు కృతజ్ఞతలు అంటూ సైరా బాను చెప్పుకోచ్చింది. అయితే కష్టకాలంలో రెహమాన్ తన మాజీ భార్యని చాలా ఆప్యాయంగా చూసుకున్న క్రమంలో వారిద్దరి విడాకుల రద్దు ఉండొచ్చొనే టాక్ నడుస్తుంది. కాగా, ఏ.ఆర్. రెహమాన్, సైరా బాను 1995లో వివాహం చేసుకున్నారు.