Ariyana ఏ క్షణాన అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిందో గానీ దశ తిరిగిపోయింది. ఆర్జీవీ నాటు కామెంట్లు చేయడం ఏంటో.. అరియానా మెలికలు తిరిగిపోవడం ఏంటో.. ఆ వీడియోలు అంతగా వైరల్ అయి ఏకంగా బిగ్ బాస్ టీంలో పడటం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ షోలోకి వచ్చింది. చివరకు నిలిచింది. టాప్ 5కి అర్హురాలేనంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఆమె తనకున్న అతిని కాస్త తగ్గించుకుంటే రన్నర్ అయ్యో అవకాశం కూడా ఉండేది.
అరియానాకు ఉన్న ఆ అతే ప్లస్ మైనస్ అయింది. ఆ అతి వల్లే అంత దూరం ప్రయాణించగలిగింది. ఆ అతి వల్ల టాప్ 4లోనే ఆగిపోయింది. అయితే అరియానా ఫ్యాన్ బేస్ బాగా పెరిగిండి. డేరింగ్ అండ్ డాషింగ్.. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేతత్త్వం ఇలా అన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయి. అలా ప్రతీసారి అరియానా సేవ్ అవుతూనే వచ్చింది. చివరి వారాల్లో జరిగిన సంఘటనల కారణంగా టాప్ 2, 3లో ఉండాల్సిన అరియానా టాప్ 4కే పరిమితమైంది.
అయితే బయటకు వచ్చిన తరువాత అరియానా తన ఫాలోయింగ్‌ను చూసి ఫిదా అయిపోయింది. తనకు పెరిగిన క్రేజ్‌ను చూసి గాల్లో తేలిపోయింది. సోషల్ మీడియాలో తన అభిమాన గణాన్ని చూసి సంబరపడిపోయింది. ఇక తనకు ఓట్లు వేసిన, ప్రేమించిన అభిమానుల కోసం లైవ్‌లొకి రావడం ముచ్చట్లు పెట్టడం వంటివి చేస్తూనే ఉంది. అయితే తాజాగా అరియానా ో హీరోకు బర్త్ డే విషెస్ చెబుతూ తన మనసులోని మాటలు బయటకు చెప్పేసింది. హ్యాపీ బర్త్ డే నాగశౌర్య గారు అని చెబుతూ.. అతనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులోనే నాగ శౌర్య అంటే క్రష్ అనే విషయాన్ని కూడా బయటకు చెప్పేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.