Bigg Boss OTT Telugu : ఔను నిజమే… అరియానా లో ఆ ఫైర్ కనిపించడం లేదు
Bigg Boss OTT Telugu : అరియానా… ఈ పేరును వింటే వెంటనే లేడీ ఫైటర్ గుర్తుకు వచ్చేది. ఆమె ఒక లేడీ పులి అన్నట్లుగా ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కాని ఇప్పుడు అరియానా అంటే ఒక సగటు సాదారణ అమ్మాయి. ఆమె గత సీజన్ లో చేసిన సందడి ఈ సీజన్ లో చేయడం లేదు. ఆమె గతంలో మాదిరిగా ఆడ పులి మాదిరిగా గాండ్రించడం లేదు. ఆమె ఈ సీజన్ లో అడుగు పెట్టడం వల్ల తన యొక్క మంచి ఇమేజ్ ను చెడగొట్టుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆశ్చర్యంను కలిగిస్తుంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అరియానా సూపర్ సక్సెస్ అవుతుందని.. గత సీజన్ లో టాప్ 5 వరకు వెళ్లింది కనుక ఈ సారి ఖచ్చితంగా ఫైనల్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ అంతా భావించారు. కాని ఆమె అభిమానులకు నిరాశ కలిగించేలా ఆమె ఆట తీరు ఉంది. ప్రతి సారి కూడా ఆమె వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఎక్కువ శాతం ప్రేక్షకులు మరియు అభిమానులు ఆమెకు దూరం అవుతున్నారు. ఇదే సమయంలో ఆమె ప్రతి విషయానికి ఎమోషనల్ అయ్యి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

ariyana glory Bigg Boss OTT Telugu nonstop latest news
తాజాగా అషు రెడ్డి ఒక స్కిట్ సందర్బంగా అరియానాలో గతంలో కనిపించినంత ఫైర్ కనిపించడం లేదు. అసలు అరియానాకు ఈ సీజన్ లో ఏమయ్యింది అంటూ వ్యాఖ్యలు చేసింది. నిజమే.. అరియానాకు ఈ సీజన్ లో ఏమయ్యింది. ఆమె గతంలో మాదిరిగా ఎందుకు జోరును కనబర్చడం లేదు. ఆమె జోరు కనబర్చక పోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా అరియానా కనీసం టాప్ 5 వరకు కూడా వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.