Ashu Reddy : అషూ రెడ్డి పాప ఔట్.. స్టేజ్‌పైన నాగార్జునకి ముద్దు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : అషూ రెడ్డి పాప ఔట్.. స్టేజ్‌పైన నాగార్జునకి ముద్దు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 May 2022,2:35 pm

Ashu Reddy: బిగ్ బాస్ హౌజ్‌లో అషూ రెడ్డి అధ్యాయం ముగిసింది. గ‌తంలో తొంద‌ర‌గానే హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన అషూ రెడ్డి ఇప్పుడు మాత్రం చాలా రోజులే ఉంది. వీకెండ్ నాగార్జున అరియానా, ఇంకా అషూరెడ్డి ఇద్దరినీ ఉంచి, అషూని ఎలిమినేట్ చేశారు. లాస్ట్ టైమ్ కూడా అరియానా, ఇంకా హమీదా ఇద్దరినీ నామినేషన్స్ లో లాస్ట్ వరకూ ఉంచి, హమీదాని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కూడా అషూతో పాటుగా అరియానాని సైతం మరోసారి టెన్షన్ పెట్టారు, అనిల్ రాధోడ్ సైతం డేంజర్ జోన్ లో ఉండ‌గా, ఈసారి కూడా ఫిమేల్ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేశారు.

అంతేకాదు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సైతం తర్వాత వారానికి దాచినట్లుగా తెలుస్తోంది.అషూరెడ్డి టాప్ – 5 లో ఉంటుందని అంచనా వేసుకుంది. ఇది మా అమ్మ కల అంటూ హౌస్ లో మాట్లాడింది కూడా. కానీ, ఇప్పుుడు టాప్ 5లో లేకుండానే వెళ్లిపోయింది. అరియనాని ఫస్ట్ టైమ్ నామినేట్ చేసిన అషూ లాజిక్ లేని పాయింట్స్ మాట్లాడింది. పీచ్ రూమ్ లో అఖిల్ కి దూరంగా ఉంటున్నావని ఎందుకు అన్నావ్ ? మా అమ్మ వచ్చినప్పటి నుంచీ అలా ఉన్నవని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ నిలదీసింది. నామినేట్ చేసింది. దీనికి అరియానా క్లారిటీ ఇచ్చినా కూడా ఇధ్దరికీ చాలారోజులు పడలేదు. అంతేకాదు, ఒకరిపై ఒకరు సెటైర్స్ కూడా వేసుకున్నారు.

ashu reddy comments on nagarjuna

ashu reddy comments on nagarjuna

Ashu Reddy : అషూ త‌గ్గేదే లే…

దీంతో అరియానా ఫ్యాన్స్ కి యాంటీ అయిపోయింది అషూ.అషూరెడ్డి లాస్ట్ టైమ్ సీజన్ లో పెద్దగా గేమ్ ఆడింది లేదు. ఆ అవకాశం కూడా తనకి రాలేదు. త్వరగానే ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఇప్పుడు ఆల్ మోస్ట్ టాప్ 5 వరకూ వచ్చింది. గేమ్ పరంగా కూడా పెద్దగా పెర్ఫామన్స్ ఇచ్చి, ఛాలెంజస్ గెలిచింది కూడా లేదు. అలాగే, సంచాలక్ గా కూడా విఫలం అయ్యింది అషూ. సరిగ్గా చూసుకోలేకపోయింది. దీంతో హౌస్ మేట్స్ అషూని నిందిస్తునే ఉన్నారు. ఎట్ట‌కేల‌కు అషూ రెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే అషూ జర్నీ వీడియోలో నాగ్ కి ముద్దు పెట్టే సీన్ రావడంతో మళ్లీ స్టేజ్ మీద నాగార్జున బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది అషూ. మొత్తానికి స్టార్టింగ్,ఎండింగ్‌లో నాగార్జునకు మాత్రం అషూ ముద్దు పెట్టేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది