Ashu reddy : వ్యవహారం తేడాగా ఉందే.. అషూ వీడియో వైరల్
Ashu reddy : బిగ్ బాస్ చిన్నది అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే అల్లరి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత సేపు ఎంతో సైలెంట్‌గా ఉన్న అషూ బయటకు వచ్చాక అసలు రచ్చ మొదలెట్టేసింది. మూడో సీజన్‌లో అషూ రెడ్డి అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ బయటకు వచ్చిన అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడితో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆ మధ్య చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. వీరి దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. ప్రేమ, పెళ్లి వంటి రూమర్లు తెగ చక్కర్లు కొట్టాయి.
అయితే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్‌కు మొత్తానికే దూరంగా ఉంటోంది అషూ. ఆ మధ్య అయితే వారానికి రెండు మూడు సార్లైనా కలిసేవాళ్లు.. పార్టీలు చేసుకునేవాళ్లు. వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా తమ తమ పనుల్లో బిజీగా మారిపోయారు. అషూ రెడ్డి బుల్లితెరపై బాగానే ఫేమస్ అవుతోంది. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోలతో అషూ ఫుల్ డిమాండ్ ఏర్పర్చుకుంది. కామెడీ స్టార్స్‌లో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి అషూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Ashu reddy : వ్యవహారం తేడాగా ఉందే.. అషూ వీడియో వైరల్
ఆన్ స్క్రీన్‌కు వచ్చే సరికి అషూ రెడ్డి ఎక్స్ ప్రెస్ హరి రొమాన్స్ మామూలుగా ఉండదు. హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతోంటారు. అయితే ఆఫ్ స్క్రీన్‌తో ఎక్స్ ప్రెస్ హరిని అన్నయ్య అంటూ అషూ ఏడిపిస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా ఓ రొమాంటిక్ రీల్ వీడియోను షేర్ చేసింది. జాతి రత్నాలు సినిమాలో ప్రపోజల్ సీన్‌ను ఇన్ స్టాలో రీల్ వీడియోగా చేశారు. ఇందులో ఇద్దరూ తెగ సిగ్గుపడిపోయారు. అయితే ఎక్స్ ప్రెస్ హరిది ఓవర్ యాక్టింగ్.. అని అంతొద్దు అంటూ కౌంటర్ వేసింది.
View this post on Instagram