Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌస్ మెట్స్ ను ప్రశ్నలతో ఆడుకున్న ఆడియెన్స్… షాక్ లో కంటెస్టెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ హౌస్ మెట్స్ ను ప్రశ్నలతో ఆడుకున్న ఆడియెన్స్… షాక్ లో కంటెస్టెంట్స్‌..!

 Authored By kranthi | The Telugu News | Updated on :11 December 2021,6:20 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 ముగింపు దశకు వచ్చేసింది. గత రాత్రి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో హౌస్‌మేట్స్‌ అంతా స్టార్లుగా నటిస్తూ ఇరగదీశారు. చిరంజీవిగా శ్రీరామ్‌, బాలయ్యగా సన్నీ, పవన్‌ కల్యాణ్‌గా మానస్‌, శ్రీదేవిగా కాజల్‌, సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరికంటే బాగా నటించి మెప్పించిన కాజల్‌ ను ఇంటి సభ్యులంతా బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. దాంతో కాజల్‌కు నేరుగా ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం దక్కింది. అనంతరం హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌ పై బయటి ఆడియ‌న్స్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఆ ప్రశ్నలకు ఎవరైతే సరిగ్గా సమాధానం ఇస్తారో… వారికి ప్రేక్షకుల్ని ఓటు అభ్యర్థించే అవకాశం కల్పించారు బిగ్ బాస్.

audience confuses Bigg Boss 5 Telugu contestents with their questions

audience confuses Bigg Boss 5 Telugu contestents with their questions

సిరికి వచ్చిన ప్రశ్న: మీరు షణ్ముఖ్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ అయినా.. మీరు ఎందుకు మిమ్మల్ని అలా కన్సిడర్ చేసుకోవడం లేదు? సిరి జవాబు : మొదటి నుంచి నాకు తోడుగా ఉండటం వల వాడికి నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను..సో వాడిని నేను ఫస్ట్ ప్లేస్ లో చూడాలి అనుకున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. కాజల్‌ కు వచ్చిన ప్రశ్న: ఆనీ మాస్టర్‌తో రెస్పెక్ట్ గురించి మాట్లాడి.. తుడిచిన టిష్యూ‌ని సన్నీపై కొట్టడం రెస్పెక్టా..? కాజల్ జవాబు : ఆనీ మాస్టర్‌తో గొడవలో అలా అన్నాను. సన్నీతో కూడా గొడవలోనే అన్నాను కానీ. అది అతడిని కూల్ డౌన్‌లో చేయడానికి మాత్రమే అన్నాను తప్ప సన్నీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది.

సన్నీకి వచ్చిన ప్రశ్న: గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ?

సన్నీ జవాబు : గిల్టీ బోర్డ్ టాస్క్ నన్ను బాగా బాధ పెట్టింది. కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్ మేట్స్‌కి నాపై కోపం రావడం వల్లే అది జరిగింది. ఆ తర్వాత నుంచి మారాను. రోజరోజుకి నా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను.

శ్రీరామ్‌ కు వచ్చిన ప్రశ్న : జెస్సీతో ఇష్యూ జరిగినప్పుడు షన్నూ ఇన్ మెచ్యూర్డ్ అని మీరు అన్నారు. కానీ ఇప్పుడు ర్యాంకింగ్‌లో మీరే షన్నూ మెచ్యూర్డ్ అని తనకి 2వ స్థానం ఇచ్చారెంటీ. ఇప్పుడు మీరు షన్నూ గ్రూప్‌ కి మారరా?

శ్రీరామ్ జవాబు : నేను ఏ గ్రూప్‌లోనూ లేనండి. ఫస్ట్‌లో నాకు తెలిసిన షన్నూ వేరే. ఇప్పుడు నాకు తెలిసిన షన్నూ వేరే. అందుకే నా ఒపీనియన్ మార్చుకున్నాను.

మానస్‌ కు వచ్చిన ప్రశ్న: ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా?

మానస్ జవాబు : దట్స్ రాంగ్. మేమిద్దరం జన్యున్‌గా కనెక్ట్ అయ్యాం. ఒకరిని వాడుకుని పైకి ఎదగాలనే మనస్తత్వం సన్నీది కాదు. సన్నీ ఏంటో నాకు తెలుసు.

షన్ను కి వచ్చిన ప్రశ్న: సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? ప్రతిసారి తనని కంట్రోల్ చేస్తూ తనని తనలా ఎందుకు ఉండనివ్వరు మీరు ?

షన్ను జవాబు : అవును నేను పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నా. కానీ కొన్ని విషయాల్లో సిరిని కంట్రోల్ చేస్తేనే నాకు బెటర్ అనిపిస్తోంది. అయితే చాలా విషయాల్లో తనని తనలానే ఉండనివ్వాలనేది నా పాయింట్. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయా. అయితే సిరితో ఎవరైన గేమ్ ఆడాలని చూస్తే మాత్రం వాళ్లని తప్పకుండా కంట్రోల్ చేస్తాను.

19 మందితో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆఖరి వారానికి వచ్చేసింది. రేపు జరగబోయే ఎలిమినేషన్ లో సిరి, కాజల్ లో ఎవరో ఒకరు హౌస్ ను వీడక తప్పదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది