baba bhaskar : నువ్ మగాడివారా?.. బుల్లెట్ భాస్కర్ ఇజ్జత్ తీసిన బాబా భాస్కర్
baba bhaskar : ఇటీవలి కాలంలో జబర్దస్త్‌లో బుల్లెట్ భాస్కర్ దూసుకుపోతున్నాడు. భాస్కర్ టీమ్ వరుసగా 12 స్కిట్స్ కొట్టింది. ముఖ్యంగా ఫైమా, ఇమ్మాన్యుయేల్, వర్ష అతని టీమ్‌లోకి వచ్చాక కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. అయితే తనపై పంచులు వేసిన చాలా లైట్ తీసుకుంటాడు భాస్కర్. ఎవరూ ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసిన పట్టించుకోడు. ఓ వైపు జబర్దస్త్‌లో రాణిస్తునే మరోవైపు బయట ఈవెంట్ల ద్వారా భారీగా డబ్బులు వెనకేస్తున్నాడు. జబర్దస్త్ షో మాత్రమే కాకుండా రెచ్చిపోదాం బ్రదర్ షోలో భాస్కర్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఆ షోలో భాస్కర్‌కు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి.

baba bhaskar sensational comments on bullet bhaskar
రెచ్చిపోదాం బ్రదర్ షో ఇప్పుడు మంచి స్పీడు మీదుంది. తాజాగా వదిలిన ప్రోమో వైరల్ అవుతోంది. భాస్కర్ చేసే కామెడీ పేలడం లేదంటూ పంచ్ ప్రసాద్, యాంకర్ మేఘన, జడ్జి బాబా బాస్కర్ ఎప్పుడూ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. భాస్కర్ స్కిట్స్ చేస్తుంటే.. వీరి ముగ్గురు రన్నింగ్ కామెంట్రీ చేస్తుంటారు. ఒక రకంగా భాస్కర్ స్కిట్స్ కన్నా వీరు చెప్పే కౌంటర్సే నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో వారు వేసే డైలాగులకు భాస్కర్.. మీకో దండం అన్నట్టుగా చూస్తాడు.
baba bhaskar : భాస్కర్ పరువుతీసిన బాబా

baba bhaskar sensational comments on bullet bhaskar
అయితే తాజాగా ఓ స్కిట్‌లో భాగంగా బాబా భాస్కర్ మాట్లాడుతూ.. వాడు కామెడీ చేయలేదు.. తీసి జైలులో వేయండి అని అంటాడు. అప్పుడు మేఘన బుల్లెట్ భాస్కర్‌ను లాక్కుని వెళ్తుంది. దీంతో భాస్కర్ ఒక మగాడిని ఆడావిడ కాలర్ పట్టుకుని అని అంటాడు. అప్పుడు బాబా భాస్కర్.. నువ్వు మగాడివి అని ఎవరూ చెప్పారురా.. అని ఇజ్జత్ తీశాడు. దీనికి భాస్కర్‌కు ఏం చెప్పాలో అర్థం కాక వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మొత్తానికి బాబా భాస్కర్ మాత్రం అందరినీ ఆడుకుంటున్నాడు.