Babu Mohan : మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన ఎలా ఉండేదో చెప్పిన బాబు మోహన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Babu Mohan : మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన ఎలా ఉండేదో చెప్పిన బాబు మోహన్..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Babu Mohan : మెగాస్టార్ చిరంజీవి ప్రవర్తన ఎలా ఉండేదో చెప్పిన బాబు మోహన్..!

Babu Mohan : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మ పురస్కారాలలో ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సినీ నటుడు బాబు మోహన్ చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోబోతున్న మెగాస్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ అవార్డు ఎప్పుడు రావాలి. ఖైదీ సినిమా టైంలోనే రావాల్సి ఉంది. ఇప్పటికీ ఖైదీ సినిమా చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఆ సినిమాలో నటనకి నటన, డాన్స్ కి డాన్స్ ఆయనకు ఆయనే సాటి అని చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు.

చిరంజీవికి ఈ అవార్డు ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చింది. నరేంద్ర మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ అయిన నాతో చాలా కలివిడిగా, సొంత మనిషి లాగా ట్రీట్ చేసేవారు. అలాంటి చిరు అన్నకు అలాంటి పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ టైంలో చిరు అన్నతో చాలా ఎంజాయ్ చేసేవాళ్లం ఆయన ఉంటే చాలు టైం అలా గడిచిపోయేది. ఆయనతో చేసినది తక్కువ సినిమాలే అయినా ఆయనతో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనకు పద్మవిభూషణం నాటి పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది అని బాబు మోహన్ అన్నారు. ఇక మచ్చలేని నాయకుడు వెంకయ్య నాయుడు అని, ఎక్కడ కాంట్రవర్సీలు లేని నాయకుడు అని, అనర్గళంగా మాట్లాడే నాయకుడు అని బాబు మోహన్ వెంకయ్య నాయుడు ని కూడా పొగిడారు.

ఆయనకు కూడా పద్మ విభూషణ్ రావడం అలా సంతోషంగా ఉంది అని అన్నారు. నాయకులకు అలాంటి పురస్కారాలు రావడం చాలా అరుదు. అలాంటిది వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ రావడం చాలా గ్రేట్ అని అన్నారు. నరేంద్ర మోడీకి, భారత్ ప్రెసిడెంట్ కి ధన్యవాదాలు అని బాబు మోహన్ అన్నారు. ఇక 2006లో చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మళ్ళీ దశాబ్దాల తర్వాత పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఇక భారతరత్న అవార్డును కూడా మెగాస్టార్ తీసుకోబోతారు అని అభిమానులు అనుకుంటున్నారు. భారతరత్నకు అతి చేరువైన పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవి పొందడం సినీ రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది