Daaku Maharaaj : డాకు మహరాజ్ థమన్.. స్పీకర్లు డబుల్ బ్లాస్ట్ అయ్యేలా దబిడి దిబిడే..!
ప్రధానాంశాలు:
Daaku Maharaaj : డాకు మహరాజ్ థమన్.. స్పీకర్లు డబుల్ బ్లాస్ట్ అయ్యేలా దబిడి దిబిడే..!
Daaku Maharaaj : సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తే నందమూరి ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ గా రాబోతున్నాడు బాలకృష్ణ Balakrishna కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజై సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఇక సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడి సాంగ్ గురువారం రాబోతుంది.
బాలయ్య సినిమా అంటే చాలు థమన్ విజృంభించేస్తాడు. ఈ కాంబోలో ఇదివరకే సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అంతేకాదు అఖండ సినిమా టైం లో యూఎస్ లో స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయి. థమన్ బిజిఎం రేంజ్ ఏంటో అది చూపించింది. ఐతే డాకు మహారాజ్ కి అదే ఫార్ములాతో వస్తున్నారట. అదిరిపోయే బిజిఎం తో వస్తున్నారని తెలుస్తుంది. ఈసారి కూడా స్పీకర్లు డబుల్ బ్లాస్ట్ అవుతాయని అంటున్నారు.
Daaku Maharaaj ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్..
డాకు మహారాజ్ సినిమా విషయంలో ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య మరో సూపర్ హిట్ టార్గెట్ గా పెట్టుకున్నారు. డాకు మహారాజ్ సినిమా మ్యూజిక్ పరంగా థమన్ ఒక ఊపు ఊపేయాలని అనుకుంటున్నాడు. అందుకు తగినట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ మరోసారి ఫ్యాన్స్ కి ఫెస్టివల్ ట్రీట్ ని డబుల్ చేయాలని చూస్తున్నాడు.
యువ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా పోటీ పడి మరి బాలకృష్ణ సినిమాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా బాలయ్య ఫాం చూసి మిగతా హీరోలంతా కూడా షాక్ అయ్యేలా ఉన్నారు. డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి వస్తుంది. మరి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమాకు బజ్ ఒక రేంజ్ లో ఉండగా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. Balakrishna, Daaku Maharaaj, Thaman, KS Bobby, Sankranthi