Unstoppable : అన్‌స్టాపెబుల్ షోలో కన్నీరు గార్చిన బాలయ్య.. కారణమేంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Unstoppable : అన్‌స్టాపెబుల్ షోలో కన్నీరు గార్చిన బాలయ్య.. కారణమేంటో తెలుసా?

 Authored By mallesh | The Telugu News | Updated on :6 December 2021,4:20 pm

Unstoppable : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’..‘అన్‌స్టాపెబుల్ విత్ ఎన్‌బీకే’షోలో ‘అఖండ’ మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ షోలో బాలయ్య హ్యాపీగా మూవీ యూనిట్ సభ్యులతో ముచ్చటిస్తూ.. చివరలో కన్నీరు గార్చారు బాలయ్య. ఇంతకీ బాలయ్య ఎందుకు కన్నీరు కార్చారు? ఆయన విషయంలో జరిగిన తప్పుడు ప్రచారం ఏంటి? ఎవరు వెన్నుపోటు పొడిచారు? అనే విషయాలు తెలియాలంటే ‘ఆహా’లో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

‘అఖండ’ మూవీ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్, విలన్ శ్రీకాంత్, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్..‘అన్‌స్టాపెబుల్’షోకు వచ్చారు. ఈ సందర్భంగా ‘అఖండ’ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు ముచ్చటించారు. చివరలో తన ఫ్యామిలీ గురించి చెప్తూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. వెన్ను‌పోటు పొడిచారని ప్రత్యేకంగా తప్పుడు ప్రచారం చేశారని, ఆ విషయం చెప్తుంటేనే తన కళ్లలో నీళ్లు వస్తున్నాయని అన్నారు. తాను ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరినని, ఆయన ఫ్యాన్స్‌లో ఒకరినని బాలయ్య చెప్పారు. ఇక ఈ ప్రోమో చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Balakrishna emotional in aha Unstoppable show

Balakrishna emotional in aha Unstoppable show

Unstoppable : వెన్ను‌పోటు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్న బాలకృష్ణ..

వెన్నుపోటు ఎవరిని ఉద్దేశించి బాలయ్య అన్నారని చర్చించుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని బాలయ్య ప్రస్తావించారా? అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని చాలా సార్లు పలువురు ఆరోపిస్తుంటారు. ఈ క్రమంలోనే దానిని గురించి ప్రస్తావిస్తూ తన బావ చంద్రబాబును బాలయ్య సపోర్ట్ చేశారా? అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాలని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

1984లో ఎన్టీరామారావు సర్జరీ నిమిత్తం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లినపుడు తనకు మెజారిటీ లేకపోయినా నాదెండ్ల భాస్కర్ రావు ఉమ్మడి ఏపీ సీఎం పీఠం ఎక్కి.. సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఎన్టీరామారావు ధర్మయుద్ధం చేసి మళ్లీ సీఎం పీఠం సొంతం చేసుకున్నారు. బహుశా ఈ విషయం గురించి బాలయ్య ‘అన్‌స్టాపెబుల్’షోలో ప్రస్తావించారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది