Balakrishna : బింబిసార ద‌ర్శ‌కుడికి క్రేజీ ఆఫ‌ర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఇక రికార్డులు చెరిగిపోవల్సిందేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బింబిసార ద‌ర్శ‌కుడికి క్రేజీ ఆఫ‌ర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఇక రికార్డులు చెరిగిపోవల్సిందేనా?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 August 2022,9:20 pm

Balakrishna : కళ్యాణ్ రామ్ ఇటీవ‌ల న‌టించిన చిత్రం బింబిసార‌. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కలెక్షన్లతో దూసుకెళ్లుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమాతో హిట్ పడింది. తాజాగా బింబిసార సినిమాను నటసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో చూశారు. బింబిసార టీంపై ప్రశంసలు కురిపించారు. . సినిమా చాలా బాగుందని అన్నారు. అలాగే సినిమాలో భావితరాలకు కావల్సిన సందేశం ఉంది. అందరూ తప్పక చూడండి అంటూ.. తన ఫ్యాన్స్ ను కోరారు బాలయ్య.

Balakrishna : క్రేజీ ఆఫ‌ర్..

కళ్యాణ్ రామ్‌తో పాటు డైరెక్టర్ వశిష్ఠ్‌ను అభినందించిన బాల‌కృష్ణ చిత్ర ద‌ర్శ‌కుడికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ దర్శకుడు వశిష్ఠకు ఛాన్స్ కూడా ఇచ్చారు బాలయ్య. బాలయ్య ఛాన్స్ ఇచ్చాడంటే మాటలు కాదు. మరి బాలయ్య కోసం వశిష్ఠ కథను సిద్ధం చేస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతం బాల‌య్య గోపిచంద్ మలినేనితో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత అనీల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే తొలి ప్ర‌య‌త్నంలోనే ఇంత భారీ చిత్రం చేయ‌డం.. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ కి వ‌రుస‌గా ఆఫ‌ర్స్ క్యూక‌డుతున్నాయి.

Balakrishna gives crazy offer to vashist

Balakrishna gives crazy offer to vashist

బాల‌కృష్ణ- వశిష్ట్ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. బాల‌య్య‌తో అల్లు అర‌వింద్ ‘ఆహా’ కోసం అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో చేస్తున్న టైమ్ లోనే ‘గీతా ఆర్ట్స్’ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేయాల‌ని అడిగార‌ట‌. బాల‌య్య వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. వ‌శిష్ట్ టాలెంట్ కి ఫిదా అయిన అల్లు అర‌వింద్ బాల‌య్య మూవీ కోసం వ‌శిష్ట్ ను రంగంలోకి దింపుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే.. వ‌శిష్ట్ కి ఇది బంప‌ర్ ఆఫ‌రే. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఎలాంటి ప్ర‌క‌ట‌న వ‌స్తుందో.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది