Balakrishna : బాలకృష్ణ కమర్షియల్ యాడ్స్ లో నటించక పోవడంకు కారణం ఏంటీ?
Balakrishna : ఒకప్పుడు హీరోలు కేవలం సినిమాల ద్వారా వచ్చే పారితోషికాల ద్వారా మాత్రమే ఆదాయంను దక్కించుకునే వారు. కొందరు మాత్రం భూములను కొనుగోలు చేసే వారు. కాని ఎక్కువ శాతం మంది అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో నే పెట్టుబడులు పెట్టేవారు. కాని ఇప్పుడు హీరోలు ఎన్నో మార్గాల ద్వారా సంపాదిస్తున్నారు. తమ క్రేజ్ ను ఉపయోగించుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు హీరోలు సినిమాల ద్వారా కంటే ఇతర ఆదాయాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఉదాహరణకు మహేష్ బాబు ఏడాదికి 50 కోట్ల రూపాయలను సినిమాల ద్వారా సంపాదిస్తే కమర్షియల్ యాడ్స్ లో నటించడం ద్వారా అంతకు మించి ఆదాయం ను దక్కించుకుంటున్నాడు.
మహేష్ బాబు మాత్రమే ప్రస్తుతం స్టార్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్స్ చేస్తున్నారు. ఇతర హీరోలు ఒకటి రెండు కమర్షియల్స్ చేస్తున్నారు. కాని కొందరు హీరోలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కటి అంటే ఒక్క కమర్షియల్ యాడ్ ను కూడా చేయలేదు. కోట్ల పారితోషికం ను కూడా కాదని కమర్షియల్ యాడ్స్ కు నో చెబుతున్నారు. అందులో బాలకృష్ణ ఒకరు అనడంలో సందేహం లేదు. 1990 సంవత్సరంలో బాలయ్య వద్దకు కమర్షియల్ యాడ్స్ ప్రపోజల్ వెళ్లిందట. ఆ సమయంలో బాలయ్య ఇండస్ట్రీలో టాప్ హీరో అనే విషయం తెల్సిందే. భారీ పారితోషికం ఇచ్చేందుకు కంపెనీ ముందుకు వచ్చిందట. కాని బాలయ్య మాత్రం కమర్షియల్ యాడ్స్ ను చేసే ఉద్దేశ్యం లేదని చెప్పేశాడట.
Balakrishna : బాలకృష్ణ కోట్ల పారితోషికం వద్దన్నాడు..
అప్పుడు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా ఎన్నో బడా కంపెనీలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరారట. కాని బాలయ్య మాత్రం ఏ ఒక్క బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కు ఆసక్తి చూపించలేదు. కోట్ల రూపాయలు పారితోషికం కూడా వద్దన్న బాలయ్య జనాలను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్రచార వీడియోల్లో నటించేందుకు నో చెప్పాడు అనేది ఆయన సన్నిహితుల మాట. ఏదైన ఒక ఉత్పత్తి గురించి మాట్లాడాలి అంటే అందులో నూరు శాతం నిజం ఉండదు. కనుక జనాలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడం ఇష్టం లేదు కనుక బాలయ్య ఎప్పుడు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదు. ఇలా ఎంత మంది హీరోలు ఉంటారు చెప్పండి.. కోట్ల రూపాయల పారితోషికం కాదనుకున్న టాలీవుడ్ హీరోలు కొద్ది మంది ఉన్నారు.