Balakrishna : బాలయ్యని ఫేస్ చేసేందుకు షర్మిల రెడీనా..? ఆమె సీట్ లో ఉంటే ఆ విషయాల మీద క్లారిటీ తెప్పించే ప్లాన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాలయ్యని ఫేస్ చేసేందుకు షర్మిల రెడీనా..? ఆమె సీట్ లో ఉంటే ఆ విషయాల మీద క్లారిటీ తెప్పించే ప్లాన్..!

 Authored By ramesh | The Telugu News | Updated on :2 November 2022,8:00 pm

Balakrishna : నందమూరి బాలకృష్ణ సినిమాలతోనే కాదు రియాలిటీ షోస్ తో కూడా రచ్చ చేస్తున్నాడు. ఆహా కోసం బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ షో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆహాలో మిలియన్ల కొద్ది వ్యూయర్ షిప్ సాధిస్తూ ఈ షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 లో 3వ ఎపిసోడ్ కోసం యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ లు వచ్చారు. వారితో బాలయ్య చేసిన హంగామా ఏంటన్నది లేటెస్ట్ గా రిలీజైన ప్రోమో చూశారు.

ఇక అన్ స్టాపబుల్ సీజన్ 2 లో నెక్స్ట్ ఎపిసోడ్ లో వైఎస్ షర్మిల కనిపించబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ని చంద్రబాబుతో చేసిన బాలకృష్ణ ఇప్పుడు వైఎస్ షర్మిలతో కూడా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. ఏపీలో అధికార పక్షంగా ఉన్న వైఎస్ జగన్ పేరు ఎత్తితేనే అంత ఎత్తున లేచే బాలయ్య ఆయన సోదరి వైఎస్ షర్మిలతో ఇంటర్వ్యూ చేస్తాడా అని అనుకోవచ్చు. వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణా పార్టీని స్థాపించారు. అయితే వైఎస్ షర్మిల ఇప్పటికే ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్నది.

balakrishna ys sharmila unstoppable season 2

balakrishna ys sharmila unstoppable season 2

అదే క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ షోలో కూడా పాల్గొనబోతుందని తెలుస్తుంది. బాలయ్యతో ఎదురుగా హాట్ సీట్ లో షర్మిల నిజంగానే ఇది రేర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆహా టీం మాత్రం అందరి అంచనాలను మించేలా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా షర్మిల వస్తే మాత్రం చంద్రబాబు ఎపిసోడ్ కన్నా ఇదే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లో షర్మిలపై వచ్చే గాసిప్పుల మీద కూడా బాలయ్య ప్రశ్నలు అడిగి సమాధానం రాబడతారని తెలుస్తుంది. వాటి పట్ల ఆమె వర్షన్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని టాక్. ఇంతకీ అన్ స్స్టాపబుల్ లో వైఎస్ షర్మిల రావడం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది