JR NTR : మహానటిలో ఎన్టీఆర్ నటించకపోవడానికి కారణం బాలయ్యనా?
JR NTR : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కి మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. ఇందులో అలనాటి సావిత్రిని మరిపించింది కీర్తి సురేష్. ఈ సినిమాలోని ఆమె నటనకు నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. అయితే ఇందులో కీర్తి మాత్రమే కాకుండా మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, అక్కినేని నాగచైతన్య, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్ కీలకపాత్రలలో నటించారు. అయితే అక్కినేని నాగేశ్వర్ పాత్రలో చైతూ నటించగా.. ఎన్టీఆర్ పాత్రలో వేరే వ్యక్తి నటించాల్సి వచ్చింది.
JR NTR : అసలు విషయం ఇది..
సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించకపోవడంపై క్లారిటీ ఇచ్చారు అశ్వినీదత్. అలీతో సరదాగా షోలో ఆయన మాట్లాడుతూ.. రామారావు గారి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిందన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు తారక్ పేరు చెప్పగానే మూవీ యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసిందన్నారు. అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ట గారు ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రకటించారని అన్నారు అశ్వనీదత్.
దీంతో తమ సినిమాలో రామారావు గారి పాత్రలో ఎవరినీ పెట్టి తీసినా ప్రేక్షకులు తప్పుగా భావిస్తారేమోనని అనిపించిందని అన్నారు. ఇదే విషయం నాగ్ అశ్విన్‌కు చెప్పానన్నారు. అయితే మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా తీస్తానని నాగీ తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అందుకే మూవీలో ఎన్టీఆర్‌కు సంబంధించి కేవలం ఒక షాట్ మాత్రమే పెట్టామన్నారు. ఎన్టీఆర్ పామును పట్టుకునే సీన్ తీశామని.. అది రామారావు గారి కెరీర్ ఆరంభంలోనే నిజంగానే జరిగిందట అని చెప్పారు అశ్వనీదత్.ఇక ఆయన పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారి కాంబోలో సినిమాలు రావడంతో చైతూ కాంబినేషన్ పై ఎక్కువ సీన్స్ తీశాం” అని చెప్పుకొచ్చారు.