Bangaram Cheppana : బంగారం యువ‌తి దొరికింది.. సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపిన ఆ యువ‌తి ఎక్క‌డిది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bangaram Cheppana : బంగారం యువ‌తి దొరికింది.. సోష‌ల్ మీడియాని ఓ ఊపు ఊపిన ఆ యువ‌తి ఎక్క‌డిది?

 Authored By sandeep | The Telugu News | Updated on :31 August 2022,7:40 pm

Bangaram Cheppana: సోష‌ల్ మీడియాతో కొంత మంది ఓవ‌ర్ నైట్ స్టార్స్‌గా మారిపోతుంటారు. ఏదో వింత‌గా ట్రై చేయ‌డం, దెబ్బ‌కు ఓవ‌ర్ నైట్ స్టేట‌స్ రావ‌డం జ‌రుగుతుంది. అలా బంగారం చాలా మంది అడుగుతున్నారు. నీ బంగారం ఎవరని? ఏం చెప్పను? నువ్వు దూరమైనావని చెప్పనా? లేక నా దగ్గరున్నావని చెప్పనా…” ఈ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యింది ఓ అమ్మాయి.ఆమె చేసిన వీడియోని చాలా మంది అనుకరించారు. శ్రీముఖితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఈ వీడియోని అనుక‌రించి నెటిజ‌న్స్ మెప్పు పొందారు. అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బంగారం అసలు పేరు శాంతి.. ఆమెది ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు. పదో తరగతి చదువుకున్న శాంతి.. ఓ షాప్‌లో పనిచేస్తుంది.

Bangaram Cheppana : బంగారం మెప్పిస్తుందా?

bangaram cheppana lady in jabardasth

bangaram cheppana lady in jabardasth

యాక్టింగ్ మీద మక్కువతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించిన శాంతి.. ఒక్క నెలలోనే సెలబ్రిటీగా మారిపోయింది. బంగారం చెప్పనా అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ బంగారం జీవితం వెనుక పెద్ద విషాదమే ఉంది. కన్నీటి గాధ ఉంది. నాన్న మతి స్థిమితం లేక ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అమ్మ నాన్న కోసం చాలా వెతికింది. అమ్మే నాన్నని చంపేసిందని అమ్మపై నిందలు వేసి కొట్టేవారు. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. పెద్ద పెద్ద కర్రలతో అమ్మని కొట్టారు.

అమ్మకి 18 ఏళ్లు ఉన్నప్పుడు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేస్తే.. ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. నాన్నపై అమ్మకి ప్రేమ ఉంటేనే కదా.. సంసారం చేసింది.. అలాంటిది నాన్నని అమ్మ ఎలా చంపుతుంది. చీర చింపి.. కర్రలతో ఉరికించి ఉరికించి కొట్టారు.. నాన్న తరుపు వాళ్లు అమ్మని చాలా బాధపెట్టారు. నేను చంపడం మీరు చూశారా? అని అమ్మ చెప్పినా సరే వదిలిపెట్టలేదు.. చావబాదేశారు. ఇళ్లల్లో పని చేస్తూ మమ్మల్ని పెంచింది. నన్ను చిన్నప్పుడే హాస్ట‌లో వేసింది. కనీసం మాకు ఇల్లు కూడా లేదు.. గుడిలో పడుకునే వాళ్లం.. అద్దె ఇల్లు కూడా ఇచ్చేవారు కాదు. ఈ బంగారం వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయి. అయితే శాంతి జబర్దస్త్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తుంది. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి ఉన్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది