Big Boss 5 Telugu : సన్నీకి సూపర్ పవర్ ఇచ్చేసిన రవి.. తర్వాత ఏమైందంటే?
Big Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్‌తో పోల్చితే చాలా డిఫరెంట్‌గా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో స్టార్ట్ అయిన షో లో ప్రజెంట్ 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్ టైటిల్ కోసం కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది.బిగ్ బాస్ రియాలిటీ షో గురువారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు తాజాగా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
Big Boss 5 Telugu : తాను పేదవాడినని బాధపడ్డ సన్నీ..
big boss 5 Telugu ravi gave his super power to sunny
సదరు ప్రోమో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ప్రోమోలో రవి, ఇతర కంటెస్టెంట్స్‌తో ముచ్చటిస్తున్న సందర్భంలో సైరన్ మోగుతుంది. అంతలోనే రవికి సూపర్ పవర్ వచ్చేస్తుంది. అయితే, ఈ సూపర్ పవర్ టూల్‌ను రవికి ఇచ్చిన ‘బిగ్ బాస్’.. రవి ఉంచేసుకోవచ్చు లేదా ఇతర హౌస్ మెంబర్స్‌కు ఇవ్వొచ్చని ‘బిగ్ బాస్’ చెప్తాడు. దాంతో తాను సన్నీకి సూపర్ పవర్ టూల్‌ను ఇస్తానని అంటాడు.
ఈ క్రమంలోనే సూపర్ పవర్ టూల్‌ను సన్నీకి ఇస్తానని రవి వెళ్తాడు. సన్నీ సూపర్ పవర్ తనకు వద్దని నిరాకరిస్తాడు. అయితే, అలా నిరాకరించడానికి లేదని, బిగ్ బాస్ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిందేనని రవి చెప్తాడు. అలా సూపర్ పవర్ సొంతం చేసుకున్న సన్నీ నెక్స్ట్ చేయబోయే టాస్క్‌లో దానిని వినియోగిస్తాడా? ఇంతకీ ఆ పవర్ యూజ్ అవుతుందా అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. అంతటితో ప్రోమో ముగియగా, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్లు కనబడుతోంది.