Vakeel saab : వకీల్ సాబ్‌కి ఇది పెద్ద ప్లస్ పాయింట్.. ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో చెప్పలేము..!
Vakeel saab : వకీల్ సాబ్ సినిమాకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఒక సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం అంత సులభమైన విషయం కాదు. సమాజంలో ఆడ పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు..వంటి ఇతి వృత్తం సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం. యూనిక్ పాయింట్ కాబట్టి ఈ కథ ఏ భాషలో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భాష మారినప్పుడు ఆ భాషలో ఏ హీరో చేస్తే సమాజానికి చెప్పాలనుకున్న విషయాన్ని పవర్‌ఫుల్‌గా చెప్పొచ్చన్నదే ఇక్కడ కీలకం.
బాలీవుడ్‌లో పింక్ సినిమాకి అమితాబ్ బచ్చన్ ఒక మేయిన్ పిల్లర్‌గా నిలిచాడు. ఆయన ఏజ్‌కి ఈ సినిమా కథ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. అందుకే అక్కడ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఇదే కథ కోలీవుడ్‌లో తీయాలనుకున్నప్పుడు హీరో అజిత్ కుమార్ అయితే కథ జనాలలోకి బాగా వెళుతుందని నిర్మాత బోనీకపూర్ భావించాడు. అదే తమిళంలో తెరకెక్కిన ఘన విజయం సాధించిన నేర్కొండ పార్వైకి బాగా కలిసి వచ్చింది. అజిత్ మేకోవర్ ..ఆయన పాత్రని మలిచిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయింది.
Vakeel saab : అందుకు టాలీవుడ్‌లో తగ్గ ఒకే ఒక్క హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
కానీ ఇలాంటి కథ తెలుగులో చేయాలంటే ఆ హీరోకి ఒక పవర్ ఉండాలి..ఆయన చెప్పే ప్రతీ మాట సున్నితంగా ఉంటూనే చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకు టాలీవుడ్‌లో తగ్గ ఒకే ఒక్క హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ తప్ప ఇంకెవరు చేసినా ఈ కథకి అంత ఇంపాక్ట్ వచ్చేది కాదేమో. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈ కథ ఓకే చేయడం గొప్ప విషయం. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా అంటే దేశ వ్యాప్తంగా అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి కథతో పవర్ స్టార్ రీ ఎంట్రీ అంటే కూడా ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి.
వాటన్నిటి లెక్క సరి చేయడానికే దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరాం పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. పవన్ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం అంటే కత్తి మీద సాము. ఈ విషయంలో ఇద్దరు సక్సస్ అయ్యారు. సమాజం పట్ల పవన్ ఆలోచనలు ఎలా ఉంటాయో అలానే కథలో మార్పులు చేర్పులు చేశారు. వకీల్ సాబ్ అంటే ఆయన కోసం కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ క్రియేట్ చేసి ముందు లా స్టూడెంట్‌గా చూపించడానికి స్క్రీన్ ప్లే లో మార్పులు చేశారు. ఇక్కడే శృతిహాసన్ రోల్ ..సోషల్ ఇష్యూస్ సాల్వ్ చేసే సీన్స్ క్రియేట్ చేశారు. ఇదే కాదు మరికొన్ని అంశాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఉండబోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు పవన్ సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలు. అందుకే ఈ సినిమా ఎన్ని వందల కోట్లు వసూల్ చేస్తుందో అంచనా వేయలేకపోతున్నారట.