ఎన్.టి.ఆర్ 30 నుంచి త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్ ..!
ఎన్.టి.ఆర్ 30 గురించి ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ వరకు దాదాపు షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం రాం చరణ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ఎన్.టి.ఆర్ మీద రాజమౌళి సోలో షాట్స్ కంప్లీట్ చేస్తున్నాడట.
కాగా ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ .. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30 వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధకృష్ణ, నదమూరి కళ్యాణ్ రాం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. కాగా అందరూ ఎన్.టి.ఆర్ 30 నుంచి న్యూ ఇయర్ సందర్భంగా ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని భావించారు. కాని ఆ సర్‌ప్రైజ్ రాలేదు.
దాంతో ఇక ఈ సినిమా అప్‌డేట్ ఇప్పట్లో రాదని ఫ్యాన్స్ తో పాటు అందరూ భావించారు. కాని సెకండ్ డే అనగా జనవరి 2 న ఈ సినిమా కి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో ఎన్.టి.ఆర్ 30 నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని ఎన్.టి.ఆర్ – త్రివిక్రం తో పాటు మేకర్స్ వెల్లడించారు.
Young Tiger @tarak9999 & Star Director #Trivikram met today!#NTR30 rolling very soon @haarikahassine@NANDAMURIKALYAN @NTRArtsOfficial pic.twitter.com/6fZ4a2CIBJ
— BARaju (@baraju_SuperHit) January 2, 2021