బిగ్ బాస్ 4 : రావణుడికి కూడా ఫాలోయింగ్ ఉంటుంది.. అరియానాపై మోనాల్ సెన్సేషనల్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

బిగ్ బాస్ 4 : రావణుడికి కూడా ఫాలోయింగ్ ఉంటుంది.. అరియానాపై మోనాల్ సెన్సేషనల్ కామెంట్స్

 Authored By uday | The Telugu News | Updated on :17 December 2020,11:45 am

బిగ్ బాస్ 4 షోలో అరియానాది ఓ డిఫరెంట్ బిహేవియర్. ఏది చేసినా వెరైటీగా ఉండాలి.. అది మంచో చెడో ఏదో ఒకటి కొత్తగా ఉండాలని జనాలు గుర్తిస్తారు.. జనాల్లోకి వెళ్తాను అని ముందే అరియానా చెప్పేసింది. దానికి తగ్గట్టే ఆమె పద్దతి, ప్రవర్తన, ఆడే విధానం కూడా వెరైటీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అరియానాకు ప్లస్ అయ్యాయి. కానీ ఆమె అతి ప్రవర్తన మాత్రమే ఆమెను కిందికి లాగుతోంది. ఏదైనా సరే అతిగా రియాక్ట్ అవ్వడమే ఆమెకున్న నెగెటివిటీ.

బిగ్ బాస్ 4 రావణుడికి కూడా ఫాలోయింగ్ ఉంటుంది అరియానాపై మోనాల్ సెన్సేషనల్ కామెంట్స్

Bigg Boss 4 Telugu Monal ABout Ariyana

అరియానా ఆటలు ఆడితే ఎలా ఆడుతుందో అందరికీ తెలిసిందే. అడ్డూ అదుపూ లేకుండా.. తాను ఒక్కతే ఆట ఆడుతుంది.. మిగతా వాళ్లు ఆడటం లేదు అనేలా ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే చెడుగానో మంచిగానో ఏదోలా ఆట అయితే ఆడుతున్నా కదా.. జనాలు గుర్తిస్తున్నారు కదా అనే యాటిట్యూడ్‌తో అరియానా ఉంటుంది. ఇంటి సభ్యులు తనను ఎలా అన్నా కూడా అన్నీ పాజిటివ్‌గానే మలుచుకుంటుంది. అలా ధైర్యంగా నిలబడే అరియానాకు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.

అయితే అలాంటి అరియానాపై మోనాల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అరియానాకు సున్నితత్వం లేదు.. ఎవ్వరినైనా హర్ట్ చేస్తుంది.. అంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. మరి అరియానాకు బయట ఫాలోయింగ్ పెరిగింది.. ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి కదా అని సదరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అంటే.. రావణుడికి కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుందని మోనాల్ పేర్కొంది. మొత్తానికి మోనాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది