బిగ్ బాస్ 4 : ఈ వారంలో ఎలిమినేట్ ఎవ‌రంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

బిగ్ బాస్ 4 : ఈ వారంలో ఎలిమినేట్ ఎవ‌రంటే..?

బిగ్ బాస్ 4 షో లో హారికను సింగిల్‌గా చూసే వాళ్లు చాలా తక్కువ మంది. హారిక అంటే అభిజిత్ పక్కనే ఉండాలని, ఆ ఇద్దరి స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందుకే అభిజిత్ హారికలను కలిపి అభిక అంటూ ఫ్యాన్స్ పేజీలు ఏర్పడ్డాయి. నిజానికి చెప్పాలంటే హారిక కంటే అభిక అనే వాటికే ఫ్యాన్స్ ఉన్నారు. రెండు వారాల క్రితమే ఏదో పుటేజ్ చూయించాడని, నీ గేమ్ నువ్ ఆడుకో అని నాగార్జున హెచ్చరించాడని హారిక అభిజిత్‌తో కాస్త […]

 Authored By uday | The Telugu News | Updated on :7 December 2020,9:01 am

బిగ్ బాస్ 4 షో లో హారికను సింగిల్‌గా చూసే వాళ్లు చాలా తక్కువ మంది. హారిక అంటే అభిజిత్ పక్కనే ఉండాలని, ఆ ఇద్దరి స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందుకే అభిజిత్ హారికలను కలిపి అభిక అంటూ ఫ్యాన్స్ పేజీలు ఏర్పడ్డాయి. నిజానికి చెప్పాలంటే హారిక కంటే అభిక అనే వాటికే ఫ్యాన్స్ ఉన్నారు. రెండు వారాల క్రితమే ఏదో పుటేజ్ చూయించాడని, నీ గేమ్ నువ్ ఆడుకో అని నాగార్జున హెచ్చరించాడని హారిక అభిజిత్‌తో కాస్త దూరంగానే ఉంటుంది.

అందుకే అభిజిత్‌ను హారిక నామినేట్ చేసింది. హారికను కూడా అభిజిత్ నామినేట్ చేశాడు. పైగా పదమూడో వారంలో అభిజిత్‌తో హారిక ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించడం లేదు. దూరం పెట్టినట్టు అనిపిస్తోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లోనూ అభిజిత్ ఇదే చెప్పాడు. ఈ వారం మొత్తం నాతో సరిగ్గా మాట్లాడలేదని ఫిర్యాదు చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా హారిక గ్రాఫ్ ఏం తగ్గకకుండా ఉండేది. కానీ హారిక మాత్రం తెలిసి తెలిసి గోతిలో పడుతోంది.

Bigg Boss 4 Telugu week 14 Harika Become close to monal And Elimination

Bigg Boss 4 Telugu week 14 Harika Become close to monal And Elimination

మోనాల్‌పై విపరీతమైన ప్రేమను కనబర్చుతోంది.. ఈ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్ అన్నంతగా బిల్డప్ ఇస్తోంది.. ఇన్నాళ్లూ కనిపించని బంధం ఈ ఒక్క వారంలోనే ఎలా బయటకు వచ్చింది.. అంటూ నెటిజన్లు ఆలోచిస్తున్నారు. పైగా అభిజిత్‌కు మోనాల్‌కు పడటమే లేదు.. బయట అభిజిత్ ఫ్యాన్స్ అందరూ మోనాల్‌ను ఎప్పుడు తోలేద్దామని చూస్తున్నారు. అలాంటిది హారిక అభిజిత్‌ను కాదని మోనాల్‌తో ఉంటోంది. పైగా అఖిల్‌తో మరింత క్లోజ్ అయ్యింది. ఈ విషయాలన్నీ ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకుని హారికను ఎలిమినేట్ చేసేద్దామని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది