Priyanka Singh : ప్రియాంకా సింగ్అవుట్.. ఇన్నాళ్లకు మంచి పని చేసిన బిగ్ బాస్
Priyanka Singh : బిగ్ బాస్ ఇంట్లో అనవసరంగా ఉంచుతున్నారు.. ఆమెను ఎందుకు ఇంకా ఎలిమినేట్ చేయకుండా ఉంచుతున్నారు.. అసలు ఎవర్రా ఆమెకు ఓట్లు వేసేది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేసేశారు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇంకెవ్వరూ బిగ్ బాస్ ఇంట్లో మానస్‌తో చేసి నస పెట్టిన ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ.
ప్రియాంకను ఇంట్లో ఎందుకు ఉంచారో అందరికీ తెలిసిందే. ఏదో ఒక ట్రాక్ నడిపించాలి.. కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ టీం బాగానే ప్రయత్నించింది. అందుకే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన ప్రియాంకను ఇలా చివరి వరకు తీసుకొచ్చారు. గత పన్నెండో వారంలోనే ప్రియాంక బయటకు వెళ్లాల్సింది. కానీ యాంకర్ రవిని బలి చేసేశారు.
Bigg Boss 5 Telugu 13th week Elimination Buzz Priyanka Singh May Out
Priyanka Singh : ప్రియాంక ఎలిమినేషన్‌పై సెటైర్లు
కానీ ఈ సారి మాత్రం ప్రియాంకను ఇంటి నుంచి బయటకు పంపించేశారట. ఈ మేరకు లీకులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రియాంక ఎలిమినేట్ అయిందని తెలియడంతో జనాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లకు బిగ్ బాస్ ఓ మంచి పని చేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మానస్ ప్రశాంతంగా ఉంటాడని, జనాలు కూడా ఆ చెత్త ట్రాకును చూసే బాధ తప్పిందని సంబరపడుతున్నారు.