Bigg Boss 5 Telugu : నువ్ ఏం పీకలేవ్.. బిగ్ బాస్ సరయుకు నెటిజన్ కౌంటర్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 23 September 2021, 9:50 pm

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారమే సరయుకు ఎదురుదెబ్బ తగిలింది. అర్దరాహిత్యమైన వాగ్వాదాలకు దిగి సరయ బ్యాడ్ ఇమేజ్ మూటగట్టుకుంది. ఇక మరీ ముఖ్యంగా సిగరెట్లు తాగడం జనాలు అంగీకరించలేకపోయారు. బిగ్ బాస్ ఇంట్లో పదే పదే స్మోక్ చేస్తూ సరయు కనిపించింది. అదే ఆమె కొంప ముంచింది. అలా సరయుకు మొదటి వారమే కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురుయ్యాయి. దీంతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

bigg boss 5 telugu fame sarayu roy gets trolls

bigg boss 5 telugu fame sarayu roy gets trolls

సరయుపై మండిపడ్డ నెటిజన్ Bigg Boss 5 Telugu

ఐదో సీజన్‌లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్‌గా సరయు నిలిచిపోయింది. అయితే బయటకు వచ్చిన సరయు మాత్రం షన్ను, సిరిల మీద పగపెంచుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ ముందే కలిసి నిర్ణయించుకుని లోపలకి వచ్చారు. కలిసే ఆడుతున్నారు..అంటూ సరయు ఆరోపణలు చేసింది. తన దగ్గరి అన్ని రకాల ఆధారాలున్నాయని సరయు లైవ్‌లో కూడా ఎమోషనల్ అయింది. అయితే తాజాగా సరయుకు ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు.

Sarayu Gets Elimintaed From Bigg Boss 5 Telugu

Sarayu Gets Elimintaed From Bigg Boss 5 Telugu

తాజాగా ఆమె పోస్ట్‌కు ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. హలో మరీ ఓవర్ యాక్షన్ చేయకు.. నీ ప్రవర్తన బాలేదు కాబట్టే ఎలిమినేట్ అయ్యావ్.. మీరు మీ హద్దులు దాటేశారు. జాగ్రత్తగా ఉండండి.. నీ దగ్గర అన్ని ఆధారాలున్నా కూడా ఏం పీకలేవ్ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై సరయు అసహనం వ్యక్తం చేసింది. ఎవడీడు అంటూ నవ్వేసింది. అయితే సరయు డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. నీ పుట్టలో వేలు పెట్టదల్చుకోలేదు అంటూ బిగ్ బాస్ ఇంట్లో దారుణంగా కామెంట్ చేసింది.

 

siri in tears when sarayu in Bigg Boss 5 Telugu

siri in tears when sarayu in Bigg Boss 5 Telugu

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి