Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ నామినేషన్స్.. ఆ ఏడుగురిలో బయటకు వెళ్లేది ఎవరంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ నామినేషన్స్.. ఆ ఏడుగురిలో బయటకు వెళ్లేది ఎవరంటే?

 Authored By bkalyan | The Telugu News | Updated on :14 September 2021,6:12 pm

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు  Bigg Boss 5 Telugu ఇంట్లో రెండో నామినేషన్ ప్రక్రియ ఓ రేంజ్‌లో జరిగింది. దీని కోసం గానూ బిగ్ బాస్ తన కంటెస్టెంట్లను రెండు టీంలు విడగొట్టాడు. వోల్ఫ్ టీం, ఈగల్ టీం అని పెట్టాడు. అలా రెండు టీంలోని సభ్యులను గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చాడు. అక్కడ అసలు ట్విస్ట్‌ను వదిలాడు. ఇందులో ఉమా, లహరి, మానస్, జెస్సీ,  రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ వోల్ఫ్ (నక్క) టీంలో ఉన్నారు. లోబో, విశ్వ, యానీ, శ్రీరాం, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలను బిగ్ బాస్ ఈగిల్ టీంలో వేశాడు. ఇ క ఓ టీంలోని సభ్యులను ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా తెలిపాడు.

Uma Devi In Bigg Boss 5 Telugu

Uma Devi  In Bigg Boss 5 Telugu

నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు Bigg Boss 5 Telugu

ఇక ఇందులో ఒక్కొక్కరు ఇద్దరు కంటెస్టెంట్లు నామినేట్ చేస్తూ రకరకాల కారణాలు చెప్పారు. నామినేట్ చేయడం, సారీలు చెప్పడం ఈ సారి కంటెస్టెంట్లకు పరిపాటి అయింది. ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని కొందరు.. తక్కువ మాట్లాడుతున్నావ్ అని  కొందరు నామినేట్ చేసేశారు. ఈ నామినేషన్ మొత్తంలో లహరి, శ్వేతా వర్మ, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్‌లు చెప్పిన కారణాలు కచ్చితంగా నవ్వు వచ్చేలా ఉన్నాయి. అలా చివరకు ఏడుగురు సభ్యులు నామినేషన్‌లోకి వచ్చారు.

 

Uma Devi In Bigg Boss 5 Telugu

Uma Devi  In Bigg Boss 5 Telugu

ఉమా దేవీ, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, కాజల్, లోబో, ప్రియ, ప్రియాంక సింగ్‌లు నామినేషన్‌లోకి వచ్చారు. ఇక ఇందులో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఉమాదేవీ, నటరాజ్ మాస్టర్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. నిన్నటి బూతు పురాణంతో ఉమా దేవికి నెగెటివిటీ పెరిగింది. కానీ ఆమెలాంటి వాళ్లు ఇంట్లో ఉంటే మజా ఉంటుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి వారం చివరి వరకు ఎలాంటి పరిణామాలు జరుగుతాయ్.. ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది