Bigg Boss 5 Telugu : సిరి, మానస్ అవుట్.. అతనే విన్నర్ !

Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ముగిసేందుకు సమయం వచ్చింది. ఈ ఒక్క రోజు గడిస్తే బిగ్ బాస్ ఐదో సీజన్ కథ ముగుస్తుంది. అయితే ఈ ఐదో సీజన్ విన్నర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం వినిపిస్తోంది. ఆ సమాధానం సన్నీ అని అందరూ చెబుతున్నారు. మామూలుగా అయితే షన్నుకి ఉన్న ఫాలోయింగ్‌తో అవలీలగా విన్నర్ అయ్యేవాడు. కానీ సిరితో రొమాన్స్ తప్పా ఇంకేం చేయని షన్ను రన్నర్‌గా మిగలడమే ఎక్కువ.

అలా మొత్తానికి హగ్గులతో విసిగించిన సిరి మొత్తానికి ఐదో స్థానంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట. నాలుగో స్థానంలో మానస్ బయటకు వచ్చాడట. శనివారం నాడు జరిగిన బిగ్ బాస్ షూటింగ్ ప్రకారం సిరి, మానస్‌లు ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. అంటే ఇంట్లో టాప్ 3 కంటెస్టెంట్లలో శ్రీరామచంద్ర, సన్నీ, షన్నులున్నారు.

Advertisement
Bigg Boss 5 Telugu Titlw Winner Buzz Is VJ Sunny
Bigg Boss 5 Telugu Titlw Winner Buzz Is VJ Sunny

Bigg Boss 5 Telugu : టైటిల్ గెలిచిన సన్నీ

ఇక శ్రీరామచంద్ర మూడో స్థానానికి పరిమితమైనట్టు తెలుస్తోంది. షన్ను రన్నర్ కాగా.. సన్నీ టైటిల్ విన్నర్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఖమ్మం కుర్రాడు.. విజయం గుమ్మానికి ఇంకో అడుగు దూరంలోనే ఉన్నాడు. నేటి మధ్యాహ్నం నుంచి మళ్లీ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నేడు బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ రంగరంగ వైభవంగా జరగబోతోంది.

Advertisement
Advertisement