Bigg Boss 6 Telugu : బాలా అన్నా.. ఇకనైనా మేలుకో అన్నా.. మంచోడు మంచోడు అనుకుంటూ ముంచేస్తున్నారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బాలా అన్నా.. ఇకనైనా మేలుకో అన్నా.. మంచోడు మంచోడు అనుకుంటూ ముంచేస్తున్నారుగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :18 October 2022,11:30 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ తో అందరితో మంచిగా ఉంటూ మంచోడుగా పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. ఈ సీజన్ లో బహుశా ఆడియన్స్ కి అందరికి బాగా సుపరిచితమైన కంటెస్టంట్ ఇతనే అని చెప్పొచ్చు. సినిమా హీరోగా.. సీరియల్ యాక్టర్ గా బాలాదిత్య క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో మొదటి రోజు నుంచి తన సత్ ప్రవర్తనతో అందరికి ఆకట్టుకున్నాడు బాలాదిత్య. ఎక్కడ గొడవ జరిగినా అది ఆపేందుకు ప్రయత్నిస్తూ హోస్ట్ నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు బాలాదిత్య.

ఆ తర్వాత గొడవలు జరిగినా పట్టించుకోకపోవడంతో మళ్లీ అదే నాగార్జున ఏమయ్యా హౌజ్ లో అంత పెద్ద గొడవ జరిగితే నీకేమి పట్టనట్టు ఉన్నావని అన్నారు. తను మంచిగా ఆడాలా.. ఇప్పటినుంచి అందరిలా అందరి మీద అరుస్తూ ఫైర్ అవుతూ ఆట కొనసాగించాలా అని బాలాదిత్య ఆలోచనలో పడ్డాడు. అయితే అందరితో ఏమో కానీ అతను సిస్టర్ అనుకున్న గీతు తోనే అతనికి పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఈ వారం నామినేషన్స్ లో గీతు బాలాదిత్యనే నామినేట్ చేసింది. అన్న అన్న అనుకుంటూ గీతు బాలాని నామినేట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది.

Bigg Boss 6 Telugu baladitya must change his game

Bigg Boss 6 Telugu baladitya must change his game

ఇప్పటివరకు మంచిగా ఉన్న నువ్వు.. అదే మంచి ఇమేజ్ తో బయటకు వెళ్లిపో అంటూ గీతు ఇచ్చిన స్టేట్ మెంట్ బాలాదిత్యని బాగా హర్ట్ అయ్యేలా చేసింది. బాలా అన్న ఇక ఇప్పుడు మోల్కొని అసలైన ఆట తీరు ప్రదర్శనించకపోతే ఇంత మంచి వాడు బిగ్ బాస్ కొట్లాటల్లో ఎందుకని బయటకు పంపించేస్తారు. సో బాలాదిత్య తక్షణమే తన ఆట తీరు మార్చుకుని మంచికి మంచి.. చెడుకి చెడు.. ఆటకి ఆట అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని ఆడియన్స్ వాదన. మొదటి రెండు మూడు వారాల్లోనే టాప్ 5 పక్కా అనుకునేలా చేసిన బాలాదిత్య సుదీపతో చివరి వరకు నామినేషన్స్ లో ఉండటం అతని గ్రాఫ్ పడిపోయింది అని చెప్పడానికి ఉదహరణ.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది