Bigg Boss 6 Telugu : అతన్ని గెలిపించడం కోసం ఇన్ని నాటకాలు అవసరమా బిగ్ బాస్.. కామన్ మ్యాన్ కాబట్టే ఆదిరెడ్డిని అంత దారుణంగా అవమానిస్తున్నారా..!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : అతన్ని గెలిపించడం కోసం ఇన్ని నాటకాలు అవసరమా బిగ్ బాస్.. కామన్ మ్యాన్ కాబట్టే ఆదిరెడ్డిని అంత దారుణంగా అవమానిస్తున్నారా..!?

 Authored By ramesh | The Telugu News | Updated on :5 December 2022,11:40 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైనల్ ఎపిసోడ్ కి రెండు వారాలు టైం ఉన్నా ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరన్నది అందరికి అర్ధమైంది. ఈ సీజన్ మొదటి నుంచి రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంటూ వస్తున్నాడు. ఆల్రెడీ అతనికి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కూడా అందుకు హెల్ప్ అయ్యింది. ఇక తన కోపంతో మొదట్లో బూతులు కూడా వదిలిన రేవంత్ నాగ్ తో యెల్లో కార్డ్ కూడా ఇచ్చాడు. అయితే తనని తాను మార్చుకోవడం అటుంచితే రేవంత్ ఇక అంతే అతన్ని మనం భరించాలి అనేలా హౌస్ మెట్స్ ని సిద్ధం చేశాడు.

ఇక ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గా వచ్చిన ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుని.. ఆ పాపులారిటీతో అతను ఛాన్స్ అందుకున్నాడు. టాస్కుల్లో కానీ.. మాట తీరులో కానీ ఆది రెడ్డి ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు. రేవంత్ తో ఆదిరెడ్డి గొడవ పడిన ప్రతిసారి బిగ్ బాస్ టీం అంతా కూడా ఆది రెడ్డిదే తప్పు అన్నట్టు అతన్ని టార్గెట్ చేస్తుంది. రీసెంట్ గా శనివారం ఎపిసోడ్ లో కూడా రేవంత్ మీద ఆది రెడ్డి చేసిన కామెంట్స్ కు సాక్ష్యంగా ఏదో వీడియో మొత్తం ప్లే చేసి హౌస్ మెట్స్ తో కూడా ఆది రెడ్డిదే తప్పు అన్నట్టు చెప్పించారు.

Bigg Boss 6 Telugu cheating for revanth winning title

Bigg Boss 6 Telugu cheating for revanth winning title

ఇదంతా టైటిల్ విన్నర్ అయ్యే రేవంత్ కి క్లీన్ సర్టిఫికెట్ అందించే విధానంలో భాగమే అని చెప్పొచ్చు. అంతేకాదు ఆది రెడ్డి ఒక కామన్ మ్యాన్ అతన్ని టార్గెట్ చేస్తే పెద్దగా నష్టం ఏమి ఉండదు ఆ ఉద్దేశంతో కూడా నాగార్జున తరచు ఆదిని కిందకు లాగుతుంటాడు. బిగ్ బాస్ టీం అంతా కూడా ఈ షో మీద ఆధారపడ్డాడు అన్న కారణంగా ఛాన్స్ ఇచ్చారు కానీ ఇలా తను ఏం చేసినా తప్పు.. ఏం మాట్లాడినా తప్పు అని పర్సనల్ గా టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ కాదని ఆడియన్స్ వాదన.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది