Bigg Boss 6 Telugu : లీకైన రెమ్యున‌రేష‌న్‌.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో ఎవ‌రికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : లీకైన రెమ్యున‌రేష‌న్‌.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో ఎవ‌రికి ఎక్కువ‌, ఎవరికి త‌క్కువ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :8 September 2022,8:00 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైన రోజే మళ్లీ ఎప్పటిలానే ఒక విషయంలో మొదటి నుంచి తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవరు కూడా పెద్దగా పేరున్న సెలబ్రిటీలు కాదని అంటున్నారు. అసలు బిగ్ బాస్ ఈసారి పూర్తిస్థాయిలో నిరాశపరిచాడు అని గతంలో కొద్దో గొప్ప పేరున్న సెలబ్రిటీలను తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ లోకి అసలు స్టార్స్ ఎవరూ రాలేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 6 Telugu : భారీ రెమ్యున‌రేష‌న్స్..

21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్స్ రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం సీజన్ కి గాను అత్యధికంగా ఓ కంటెస్టెంట్ రోజుకు రూ. 60 వేలు తీసుకుంటుండగా అత్యల్పంగా మరో కంటెస్టెంట్ కేవలం రూ. 15 వేలు తీసుకుంటున్నారట. సీరియల్ నటి కీర్తి భట్ రోజుకు రూ. 35 వేలు తీసుకుంటున్నారట. ఇక పింకీ రూ. 25 వేలు ఛార్జ్ చేస్తున్నారట. అనూహ్యంగా యూట్యూబర్, సిరి లవర్ శ్రీహాన్ రోజుకు రూ. 50 వేలు అందుకుంటున్నాడట. నేహా చౌదరి రెమ్యూనరేషన్ రూ. 30 వేలు అని సమాచారం. మోడల్ అండ్ యాక్ట్రెస్ శ్రీసత్య కూడా రోజుకు రూ.30 వేలు తీసుకుంటున్నారట.

Bigg Boss 6 Telugu Low And High Remuneration Contestants

Bigg Boss 6 Telugu Low And High Remuneration Contestants

వైజాగ్ కుర్రాడు అర్జున్ కి రోజుకు రూ.35 వేలు పారితోషికం ఇస్తున్నారట. ప్రస్తుతం ఇతడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. చలాకీ చంటి రోజుకు రూ. 50 వేలు తీసుకుంటున్నాడట. మాజీ ఐటెం గర్ల్ అభినయశ్రీ రోజుకు రూ.20 వేల ఒప్పందంపై బిగ్ బాస్ షోకి వచ్చినట్లు సమాచారం. గీతూ రాయల్ రోజుకు రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు వినికిడి. బాల ఆదిత్య రోజుకు రూ.35 వేలు తీసుకుంటున్నారట. మరీనా, రోహిత్ రోజుకు చెరో రూ.40 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. సీరియల్ నటి వాసంతి కృష్ణన్ రెమ్యూనరేషన్ రోజుకు రూ.25 వేల అట. షానికి రోజుకు రూ.30 వేలు ఆఫర్ చేశారట. ఆర్జే సూర్య రోజుకు రూ.40 వేల వరకు ఛార్జ్ చేస్తున్నాడట. యూట్యూబ్ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి రోజుకు రూ. 30 వేలు ఆయన రెమ్యూనరేషన్ అని వినికిడి. కంటెస్టెంట్ ఆరోహి రావు అత్యల్పంగా కేవలం రూ.15 వేలు తీసుకుంటున్నారట. ఫైమా రోజుకి రూ.25 వేలు అందుకుంటున్నారట. రాజశేఖర్ కు రోజుకు రూ.20 వేల పారితోషికం ఇస్తున్నారట.ఏమాత్రం ఫేమ్ లేని నటి ఇనయ సుల్తానాకి కూడా అతి తక్కువ రెమ్యూనరేషన్ రోజుకి రూ.15 వేలు ఇస్తున్నారట. సింగర్ రేవంత్ రోజుకు రూ. 60 వేలు ఛార్జ్ చేస్తున్నారట

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది