Bigg Boss 6 Telugu : పేరుకి రూ.50 లక్షలు కాని బిగ్ బాస్ విన్నర్‌కి మిగిలేది అంత తక్కువ మొత్తమా?
Bigg Boss 6 Telugu : గత సీజన్స్ కన్నా కూడా ఈ సీజన్ బిగ్ బాస్ లో వినోదం కరువైంది. కంటెస్టెంట్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచకపోవడంతో ఈ సీజన్‌పై ఆసక్తి లేకుండా పోయింది. రేటింగ్స్ కూడా దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్స్ అన్నింటింలోను ఈ సీజన్ చెత్త రికార్డుల్ని నమోదు చేసుకుందని అంటున్నారు. కంటెస్టెంట్లు వాళ్ల ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ అంత మంచింది. ఈ సీజన్ వలన బిగ్ బాస్ చేతులు కాల్చుకున్నాడని ప్రచారం జరుగుతుండా, ఇప్పుడు వీలైన కాడికి మిగుల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఎంత చెత్తగా ఆడిన కూడా ప్రైజ్ మనీ ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుంది కాబట్టి.. ప్రతిసీజన్ మాదిరిగానే ఈ సీజన్‌కి కూడా నాగార్జున ప్రైజ్ మనీ ప్రకటించారు.
ఏందయ్యా ఇది..
ఆదివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్‌కి రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ విన్నర్ కి కూడా రూ.50 లచ్చలు ఇస్తున్నారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. పేరు మాత్రమే ప్రైజ్ మనీ రూ.50 లక్షలు, కాని ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. ప్రైజ్ మనీ రూ.50 లక్షలు అని చెప్పారు కానీ.. ఇందులో కోత భారీగానే ఉంటుంది. దాదాపు రూ.14 లక్షలు టాక్స్ రూపంలో కట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఇది ప్రతి సీజన్‌లో జరుగుతూ వస్తుంది. విన్నర్ అయిన కంటెస్టెంట్ దక్కించుకునేది దాదాపుగా రూ.34 లక్షలు. ఇదైన దక్కుతుందా అనుకుంటే ఈ సారి చాలా కోతలు ఉన్నాయట. బిగ్ బాస్ ఈ సారి కొత్త ఎత్తుడగ వేయగా, 11వ వారంలో ఇమ్యునిటీ పేరుతో ఇంటి సభ్యులు ఇమ్యునిటీ పొందడానికి చెక్‌లపై అమౌంట్ రాయాల్సి ఉంటుందని అన్నారు.
ఈ అమౌంట్‌ని విన్నర్‌కి వచ్చే ప్రైజ్ మనీలో మినహాయించబోతున్నారన్నమాట. అంటే ఒక లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఎంతైనా రాయోచ్చు అని బిగ్ బాస్ చెప్పగా, ఇందులో రాజ్ అందరికంటే ఎక్కువగా దాదాపు రూ.5 లక్షలు రాసి ప్రత్యేక ఇమ్యునిటీ పొందటంతో పాటు ఈవారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. అంటే ఈ ఐదు లక్షలు కూడా విన్నర్ ప్రైజ్ మనీలో మినహాయింపు ఉంటుందన్నమాట. అంటే మిగిలిన రూ.34 లక్షల్లో ఐదు లక్షలు తీసేస్తే.. మిగిలేది కేవలం రూ.29 లక్షలు మాత్రమే. ఇదైన దక్కుతుంటా అనుకుంటే బిగ్ బాస్ టాప్ 3 వాళ్లకి ఆఫర్స్ ఇస్తాడు. సూట్ కేసు ఇచ్చి ఇందులో పాతిక లక్షలు ఉన్నాయి, డ్రాప్ అయితే ఇది తీసుకెళ్లొచ్చు అంటే మాత్రం విన్నర్‌కి మిగిలేది కేవలం 4లక్షలు మాత్రమే.