Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో చూడాలి అంటేనే అసహ్యం వేస్తోంది అని సీరియస్ అవుతున్న ప్రేక్షకులు .. కారణం ఇదే !
Bigg Boss 6 Telugu : విదేశాలలో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు మనదేశంలోకి అడుగుపెట్టి నానా హంగామా చేస్తుంది. ఈ షో ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. తెలుగులో సీజన్ 6 నడుస్తుండగా, ఈ సీజన్ ప్రేక్షకులకి చాలా చిరాకు కలిగిస్తుంది.అందుకు కారణం కంటెస్టెంట్స్ ఇచ్చే చెత్త పర్‌ఫార్మెన్స్. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించి హౌస్ లోకి అడుగుపెట్టిన గీతూ తన తెలివి తేటలతో గేమ్ బాగానే ఆడుతుంది. మనసులో ఏది ఉంటె అది దాచుకోకుండా మాట్లాడడం..బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అద్భుతంగా ఆడడం వల్ల ఆమెకి క్రేజ్ కూడా బాగా పెరిగింది. అయితే ఆమె ఓవరాక్షన్, చెత్త కామెడీ, యాస చిరాకు కలిగిస్తున్నాయి.
రీసెంట్‌గా జరిగిన టాస్క్‌లో హౌజ్‌మేట్స్ చార్జింగ్ త్యాగం చేసి ఇంటి సభ్యులతో మాట్లాడారు..వారిలో గీతూ కూడా ఒకరు..40 శాతం వరుకు బ్యాటరీ ని ఉపయోగించుకొని ఆమె తన తండ్రి తో మాట్లాడింది..అందరు ఫ్యామిలీతో మాట్లాడి ఎమోషనల్ అయితే గీతూ మాత్రం వెకిలి చేష్టలు చేస్తూ చిరాకు తెప్పించింది. ఆమె ప్రతి వారం ఏదోలా ఓవారక్షన్ చేస్తూ విసుగు తెప్పిస్తుంది. ఏదో ఒక రోజు ఎలిమినేట్ కావడం పక్కా అని కొందరు చెప్పుకొస్తున్నారు. రోజురోజుకొ ఆమె గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఇక ఇనయ, సూర్య, శ్రీ సత్య, అర్జున్‌తో పాటు మరి కొందరు కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. వారాలు గడిచే కొద్ది బిగ్ బాస్ షో కొంత ఆసక్తికరంగా మారుతుంది.

Bigg Boss 6 Telugu Show gets boaring
Bigg Boss 6 Telugu : ఏందీ రచ్చ…
గేమ్స్, టాస్క్ ఉత్కంఠ రేపుతున్నాయి. గత రెండు వారాల టీఆర్పీ కూడా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దీని కోసం ‘ఆఖరి వరకు ఆగని పరుగు’ పేరుతో టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి, వాసంతి మధ్య పోటీ ఏర్పడింది. వీరిద్దరిలో ఒకరిని మిగతా ఇంటి సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నికైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళతారు. ఇక ఆదిరెడ్డి, వాసంతి ఎందుకు కెప్టెన్ కావాలి అంటుకుంటున్నారో ఇంటి సభ్యులకు చెప్పాలి. ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాను. నాగార్జున సార్ నువ్వు ఏమీ పీకలేకపోయావ్ అన్నారు. కాబట్టి ఇంకోసారి అవకాశం ఇస్తే పీకుదామని, అని చెప్పారు. ఆదిరెడ్డి అలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.