Bigg Boss 6 Telugu : ఇప్పుడు బిగ్ బాస్ అసలు రంగు బయటపడింది.. కంటెస్టెంట్లకు కూడా అర్థమయిందా?
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా తయారైంది. బిగ్ బాస్ ముందు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ.. బిగ్ బాస్ 6 పరిస్థితి దరిద్రంగా తయారైంది. దానికి కారణం.. బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలు. ఆ టాస్కులు, వరస్ట్ నిర్ణయాలు, హోస్టింగ్ అన్నీ అలాగే తయారయ్యాయి. బిగ్ బాస్ ఇంకొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికైనా బిగ్ బాస్ కళ్లు తెరవకపోతే ఎలా అని నెటిజన్లు, బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే..
ఇప్పటికీ బిగ్ బాస్ తీసుకునే పనికిమాలిన నిర్ణయాలకు నెటిజన్లే కాదు.. కంటెస్టెంట్లు కూడా తికమక అవుతున్నారు.నిజానికి.. బిగ్ బాస్ 6 ఇప్పుడు టికెట్ టు ఫినాలే వరకు చేరుకుంది. టికెట్ టు ఫినాలే అంటే మామూలుగా ఉండొద్దు. రచ్చ రచ్చ చేయాలి. కానీ.. ఈసారి అదేం లేదు. టికెట్ టు ఫినాలేకు ఎవరు వెళ్తారు.. ఎవరు వెళ్లరు అనేదానిపై జోరుగా చర్చ సాగాలి. అనుకున్న కంటెస్టెంట్లు టికెట్ టు ఫినాలేకు వెళ్లకూడదు. అనుకోని వాళ్లు వెళ్లాలి.. అలా అయితేనే టికెట్ టు ఫినాలేలో మంచి రసపట్టు ఉంటుంది.
Bigg Boss 6 Telugu : విన్నర్ ఎవరో? రన్నర్ ఎవరో ముందే తెలిసిపోయిందా?
కానీ.. టికెట్ టు ఫినాలే ముందే.. విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో తెలిసిపోయింది. టాప్ 5కి వెళ్లేది ఎవరో కూడా ముందే తెలిసిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు కూడా ముందే తెలిసిపోయిందా? ఏంటి అనేది అర్థం కావడం లేదు. వాళ్లకు కూడా విన్నర్ ఎవరో ముందే తెలిసిపోయిందని అంటున్నారు. మొత్తానికి టికెట్ టు ఫినాలే టాస్క్ మాత్రం చాలా చప్పగా అయిపోయింది. ముందే టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలిసిపోవడంతో ఇందులో పస ఏముంది అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.