Bigg Boss 6 Telugu : ఆదిరెడ్డి ని అత్యంత దారుణంగా మోసం చేసిన బిగ్ బాస్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : ఆదిరెడ్డి ని అత్యంత దారుణంగా మోసం చేసిన బిగ్ బాస్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,6:20 pm

Bigg Boss 6 Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ లో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సీజన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలియని వారిని హౌస్ లోకి తీసుకువచ్చిన బిగ్బాస్ టీఆర్పి రేటింగ్ అయితే తగ్గించుకుంది. ప్రస్తుతం బిగ్బాస్ లో మూడు వారాలు మిగిలిన నేపథ్యంలో హౌస్ లో ఇంకా ఎనిమిది మంది కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. ఇందులో ఈవారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న రేవంత్ ఎప్పటిలాగే నెంబర్ వన్ ప్లేసులో కొనసాగుతున్నారు. అయితే సెకండ్ ప్లేస్ లో రోహిత్ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అలాగే థర్డ్ ప్లేస్ లో కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చిన ఆదిరెడ్డి ఉన్నాడు. నాలుగో ప్లేసులో కీర్తి, ఐదో ప్లేసులో శ్రీ సత్య ఆరో ప్లేస్ లో పైమా ఉన్నారు. ఈవారం జబర్దస్త్ పైమా హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందట. కానీ ఈ సీజన్ ఇప్పుడు చివరికి వచ్చింది. ఇందులో ఇంకా మూడు వారాలు మిగిలి ఉన్నాయి. కానీ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే మిగతా సీజన్ ని బట్టి చూసుకుంటే ఈవారం డబల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ ఎలిమినేషన్లో శ్రీ సత్య హైమ ఉన్నారు.

Bigg Boss 6 Telugu who cheated Aadi Reddy the worst

Bigg Boss 6 Telugu who cheated Aadi Reddy the worst

కానీ బిగ్ బాస్ టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ సెలెక్ట్ చేసి పెట్టిందట. కాబట్టి శ్రీ సత్యకు బదులు కామన్ మ్యాన్గా వచ్చిన ఆది రెడ్డిని హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యంఅనుకుంటుందట. అయితే ఈ విషయంలో ఓటింగ్ అసలు లెక్కలోకి తీసుకోమని బిగ్బాస్ చెబుతుంది. మరి అలాంటప్పుడు ఓటీంగ్ పెట్టడం ఎందుకు అని బిగ్ బాస్ ప్రేక్షకులు అంటున్నారు. ఈ విషయంలో శ్రీ సత్య కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్న ఆదిరెడ్డి చేస్తే ఆయనను దారుణంగా మోసం చేసినట్లే అవుతుందని ఫాన్స్ భావిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది