Bigg boss 7 Telugu : బిగ్ బాస్ 7 లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ .. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg boss 7 Telugu : బిగ్ బాస్ 7 లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ .. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున ..

 Authored By aruna | The Telugu News | Updated on :11 September 2023,10:00 am

Bigg boss 7 Telugu : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ షో కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్బాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ మూడున గ్రాండ్ గా లాంచ్ అయింది. చూస్తుండగానే వారం కూడా గడిచిపోయింది. ఇక మనకి తెలిసిందే ప్రతివారం కంటెస్టెంట్ ల ఎలిమినేషన్ లు జరుగుతుంటాయి. భారీ అంచనాల మధ్య బడా కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోపలికి వెళ్లారు. మరి ముఖ్యంగా ఈసారి అబ్బాయిలకు పోటీ ఇచ్చే విధంగా అమ్మాయిలను కూడా చూస్ చేసుకోవడం బిగ్ బాస్ కు మరింత ప్లస్ అయింది.

ఈవారం హౌస్ నుంచి ఒక వ్యక్తి ఎలిమినేట్ అవ్వక తప్పదు. నాగార్జున అన్నట్లుగానే మొత్తం ఉల్టా పల్టాగా నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే కంటెంస్టెంట్ లని కూడా ఎవరు ఊహించలేరు. అంతా టఫ్ గా ఓటింగ్ జరిగింది. ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ నిన్న పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేటఅయ్యారనే విషయం సోషల్ మీడియాలో లీక్ అయిపోయి వైరల్ గా మారింది. నామినేషన్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ ఇద్దరు మిగిలారు. ఐతే ఇందులో ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేసే వీలుంది.

Bigg boss 7 contestents eliminations

Bigg boss 7 contestents eliminations

అయితే సోషల్ మీడియాలో బిగ్బాస్ హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ని పంపించేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు తెలుగు రాక అష్ట కష్టాలు పడుతుందని, హౌస్ లో ఉండి ఇబ్బందులు పడడం కన్నా బయటికి వెళ్లిపోవడం మంచిదని హౌస్ లోని కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేశారట. తెలుగు రాని వాళ్ళు హౌస్ లో ఉంచడం ఎందుకు అనుకున్నారో ఏమో అందుకే ఆమెను ఎలిమినేట్ చేశారు అని జనాలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమో కాదో తెలియదంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాలి. ఏది ఏమైనా బిగ్బాస్ హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి లేదంటే ఎప్పటిలాగే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది