Vishnu Priya : బిగ్ బాస్ మానస్‌తో విష్ణుప్రియ చిందులు.. ఇలా కూడా చేస్తున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : బిగ్ బాస్ మానస్‌తో విష్ణుప్రియ చిందులు.. ఇలా కూడా చేస్తున్నారా?

Vishnu Priya : బిగ్ బాస్ షోతో మానస్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సీరియల్స్‌లో నటించాడు. అంతకంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ షో అనేది మానస్‌ను జనాలకు మరింత దగ్గరగా చేసింది. ఐదో సీజన్‌లో మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ట్రాన్స్‌జెండర్ ప్రియాంకతో కొన్ని సార్లు మానస్‌కు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ మొత్తంగా మానస్ జర్నీ బిగ్ బాస్ షోలో సాఫీగానే సాగింది. బయటకు వచ్చిన […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 August 2022,1:46 pm

Vishnu Priya : బిగ్ బాస్ షోతో మానస్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు సీరియల్స్‌లో నటించాడు. అంతకంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఫేమస్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ షో అనేది మానస్‌ను జనాలకు మరింత దగ్గరగా చేసింది. ఐదో సీజన్‌లో మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ట్రాన్స్‌జెండర్ ప్రియాంకతో కొన్ని సార్లు మానస్‌కు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ మొత్తంగా మానస్ జర్నీ బిగ్ బాస్ షోలో సాఫీగానే సాగింది. బయటకు వచ్చిన మానస్‌కు అంతగా అవకాశాలేమీ రాలేదు. హీరోగానూ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కార్తీక దీపంలో మెయిన్ లీడ్ కారెక్టర్ వచ్చింది.

డాక్టర్ సాబ్ అంటూ బాగానే ఫేమస్ అయ్యాడు. కానీ మానస్‌కు మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు మంచి డ్యాన్సర్‌గా, నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విష్ణుప్రియతో కలిసి మానస్ ఓ ప్రైవేట్ సాంగ్ చేసినట్టు కనిపిస్తోంది. అసలే విష్ణుప్రియ తన భారీ అందాలను తెగ ఊపేస్తోంటోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఈవెంట్లలో విష్ణుప్రియ ఎక్కువగా డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చేస్తుంటుంది.

Bigg Boss Maanas With Vishnu Priya in Folk SOng

Bigg Boss Maanas With Vishnu Priya in Folk SOng

ఇక బుల్లినిక్కర్లు వేసుకుని, టీ షర్ట్ పైకి లేపి.. నడుము చూపిస్తూ విష్ణుప్రియ చేసే స్టెప్పులు బాగానే వైరల్ అవుతుంటాయి. జరీ జరీ పంచెకట్టు అనే ఈ ఫోక్ సాంగ్‌తో మానస్ విష్ణుప్రియ కలిసి స్టెప్పులు వేయబోతోన్నారు. ఆగస్ట్ 27న ఈ సాంగ్ రాబోతోందట. తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో మాస్ మెచ్చే అదిరిపోయే బీట్ ఉందనిపిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది