Bigg Boss OTT Telugu : ఇదేంటి బిగ్‌బాస్‌.. నాగార్జున వచ్చేది ఒక్క రోజేనా.. మరింత డ్యామేజీ ఖాయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : ఇదేంటి బిగ్‌బాస్‌.. నాగార్జున వచ్చేది ఒక్క రోజేనా.. మరింత డ్యామేజీ ఖాయం

 Authored By himanshi | The Telugu News | Updated on :6 March 2022,4:30 pm

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అంటూ విమర్శలు వస్తున్నాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మరో సారి వారు తీసుకున్న నిర్ణయం కాస్త ప్రేక్షకులకు అసంతృప్తి కలగజేస్తోంది. సాధారణ బిగ్‌బాస్‌ లో హోస్ట్ వారంలో రెండు రోజులు ప్రేక్షకుల ముందుకు వస్తారు. కానీ బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లో మాత్రం హోస్టు గా చేస్తున్న నాగార్జున కేవలం వారం కి ఒక్కరోజు మాత్రమే వస్తారు అని తేలిపోయింది.నిన్న శనివారం ప్రత్యేక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.

కానీ నాగార్జున ఎపిసోడ్ కాకుండా రెగ్యులర్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కేవలం ఆదివారం మాత్రమే నాగార్జున షో కి హాజరు అవుతాడు. వారంలో రెండు రోజులు కాకుండా కేవలం ఆదివారం మాత్రమే ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని క్లారిటీ వచ్చేసింది. ఈ విధానాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికే బిగ్‌బాస్‌ చూడడానికి బోరింగ్ గా అనిపిస్తుంది కనీసం వీకెండ్స్ లో అయినా నాగార్జున వచ్చి సందడి చేస్తాడు అని భావించారు. కానీ ఇలా చేశారు ఏంటీ అంటూ ప్రేక్షకులు నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

Bigg Boss OTT Telugu biggboss nonstop bad news for nagarjuna fans

Bigg Boss OTT Telugu biggboss nonstop bad news for nagarjuna fans

గతంలో వచ్చిన బిగ్‌బాస్‌ ను ఈ సీజన్ ని పోల్చుతూ తీవ్ర నిరుత్సాహం గురవుతున్నారు. నాగార్జున ఈ సీజన్ కోసం భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో నాగార్జున మరింత జోష్ గా వారంలో రెండు రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆయన ఎంటర్టైన్మెంట్ కేవలం ఒక్క రోజే అని తేలిపోయింది. ఇప్పటికే ఆదరించడం లేదు, నాగార్జున శనివారం రాకపోవడంతో మూలిగే నక్క మీద తాటిపండు చందంగా బిగ్‌బాస్‌ దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవలసి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది