Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్‌కు బ్రేక్.. మూడు రోజుల్లోనే లైవ్ స్ట్రీమింగ్ క్లోజ్..
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ అభిమానులకు ఇది నిజంగా షాక్ అనే చెప్పాలి. ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24 గంటల పాటు స్ట్రీమింగ్ అని చెప్పుకొచ్చారు నిర్వాహకులు. నో కామా, నో ఫుల్ స్టాప్.. ఎంటర్ టైన్‌మెంట్ అంటూ ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ ను స్టార్ట్ చేశారు. పోయిన శనివారం హంగూ ఆర్భాటాలతో నాగార్జున హోస్టింగ్‌లో ఈ ప్రోగ్రాం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాంను గతంలో మాదిరిగా స్టార్ మా ఛానెల్ లో కాకుండా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.
ఈ షో పై ఎందుకు ఎన్ని కామెంట్స్ చేసిన కామర్ వీవర్స్ ఉంటూనే ఉంటారు. 24 గంటలు పాటు లైవ్ అనే సరికి చాలా మంది హాట్‌స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని డబ్బులు కట్టి మరి సబ్ స్కైబ్ చేసుకున్నారు. కానీ దీనిని వీవర్స్ నుంచి ఎక్కువగా స్పందన రాలేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా. ఇందుకు తోడు పోయిన సీజన్ హగ్, కిస్ ల బ్యాచ్ వల్ల షో ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఓటీటీపై వీవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.ఇక ఆడియన్స్, వీవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం. దీనికి తోడుగా 24 గంటల పాటు ఊకదంపుడు షో అనగానే ముందే చేతులు ఎత్తేశారు. ఇక బుధవారం అర్ధరాత్రి వరకు షో లైవ్ కొనసాగినా..
Bigg Boss OTT Telugu : చేతులెత్తేశారు..
12 దాటిన తర్వాత దానిని నిలిపివేశారు. ఫస్ట్ డే నాగార్జున షోను లాంచ్ చేసిన ఎపిసోడ్‌ను రిపీట్ చేశారు. ఇక గురువారం రాత్రి 12 గంటల నుంచి లైవ్ మళ్లీ స్టార్ట్ అవుతుందని, ఎప్పటి ఎపిసోడ్ ను అప్పడు రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తామని స్ర్కోలింగ్ ఇచ్చారు. ఇలా చేయడంతో లైవ్ స్ట్రీమింగ్ అనుకుని సబ్ స్క్రైబ్ చేసుకున్నామని, చాలా డబ్బులు పెట్టామని చాలా మంది సీరియస్ అవుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.