Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ చివర్లో ఇలా దిగజారి పోతున్నావేంటి బిందు మాధవి?
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగింపు దశకు చేరుకుంది. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుండటం వల్ల ఈ సినిమా ను ఎవరు పట్టించుకుంటారు లే అని అంతా భావించారు. కాని అనూహ్యంగా బిగ్ బాస్ ఓటీటీ కి మంచి ఆధరణ దక్కింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బిగ్ బాస్ గురించి చర్చించుకునే స్థాయి లో మంచి ఆధరణ దక్కించుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు క్లైమాక్స్ చేరిన ఈ సమయంలో ఈక్వెషన్స్ అన్నీ కూడా మారుతూ ప్రతి ఒక్కరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ముందుకు దూసుకు పోతున్నారు.
సీజన్ ప్రారంభం నుండి కూడా బిందు మాధవి చాలా కూల్ గా తన ఆట తీరుతో మంచి పేరును దక్కించుకుంది. ఇక ఆమె శివతో కొనసాగించిన స్నేహం ను ప్రతి ఒక్కరు కూడా అభినందించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని వారాలుగా వరుసగా నామినేట్ అవుతూ వస్తున్నా కూడా బిందు మాధవిని ఆమె అభిమానులు సేవ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఆమె టాప్ 5 లో ఉంటుందని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు విజేత గా కూడా బిందు మాధవి నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆమె ప్రవర్తనను అభిమానించిన వారే ఇప్పుడు ఆమెను తిడుతున్నారు. ఆడపులి అంటూ ఆమెను గొప్పగా ప్రతి ఒక్కరు అన్నారు.

Bigg Boss OTT Telugu Nonstop Bindu Madhavi over action trolls
కాని ఆమె ఇప్పుడు మాత్రం అతి చేస్తూ కోతి అనిపించుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా తన గురించి విమర్శలు చేసిన సమయంలో లేదా తన గురించి మాట్లాడిన సమయంలో అగ్రెసివ్ అవుతుంది. ఆమె ఆ సమయంలో ఏం చేస్తుందో కూడా అర్థం కావడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. నామినేషన్స్ సమయంలో ఆమె కోపాన్ని ఆపుకోలేక పోతుంది. ఆ సమయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరుపై నాగ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. అయినా కూడా మళ్లీ అదే వెకిలి చేష్టలు చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. చివరి వారంలో బిందు ఇలా చేయడం ను ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. ఇలా చేస్తే టైటిల్ విన్నర్ అవ్వడం కష్టం అంటున్నారు.