Bigg Boss Samrat : తండ్రైన బిగ్ బాస్ సామ్రాట్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ అంటూ ఎమోషనల్

Authored By aruna | The Telugu News | Published on: August 16, 2022, 4:20 pm

Bigg Boss Samrat : బిగ్ బాస్ షోతో సామ్రాట్ వెలుగులోకి వచ్చాడు. అంతకు ముందు సామ్రాట్ ఎన్నో సినిమాలు చేశాడు. సపోర్టింగ్ రోల్స్, విలన్ ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు. కానీ బిగ్ బాస్ షోతోనే సామ్రాట్‌‌కు మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో సామ్రాట్‌‌ను మంచివాడు, సౌమ్యుడు అనే ట్యాగ్ వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో సామ్రాట్ ఎవ్వరితోనూ గొడవ పెట్టుకునే వాడు కాదు. అసలు గొడవల జోలికే వెళ్లేవాడు కాదు. నచ్చకపోతే దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడు. ఇక తనీష్, సామ్రాట్, తేజస్వీ, దీప్తి సునయన ఓ గ్యాంగులా ఉండేవారు.

బిగ్ బాస్ ఇంట్లో సామ్రాట్ ఉండగానే తన మొదటి పెళ్లి, విడాకుల వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. మొత్తానికి మొదటి వివాహాం విడాకుల ద్వారా రద్దైంది. బిగ్ బాస్ నుంచి సామ్రాట్ బయటకు వచ్చాక.. అంతగా ఆఫర్లేమీ రాలేదు. సినిమాలు గానీ షోలు గానీ చేయలేదు. కానీ సామ్రాట్‌ను జనాలు చూసే ధోరణి మాత్రం మారిపోయింది. ఇక సామ్రాట్ తన జీవితంలోని కొత్త దశను ప్రారంభించాడు. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం సామ్రాట్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

Bigg Boss Samrat Reddy Blessed With Baby Girl

Bigg Boss Samrat Reddy Blessed With Baby Girl

శ్రీలిఖిత అనే అమ్మాయిని సామ్రాట్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. రాజమండ్రిలో సామ్రాట్ ఈ పెళ్లి చేసుకోగా.. కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. తేజస్వీ, తనీష్, దీప్తి సునయన వంటి వారు ఆ పెళ్లిలో సందడి చేశారు. ఇక హైద్రాబాద్‌లో సామ్రాట్ గ్రాండ్ రిసెప్షన్ పార్టీని ఇచ్చాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా కూడా సందడి చేశారు. ఇక సామ్రాట్ లిఖితలు నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. వీరి ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కపుల్ గోల్స్ అంంటూ సామ్రాట్, లిఖిత హంగామా చేస్తుంటారు.

Bigg Boss Samrat : తండ్రి అయిన సామ్రాట్..

ఆ మధ్య తండ్రి కాబోతోన్నట్టు సామ్రాట్ ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాను తండ్రైనట్టు, పండంటి బిడ్డ పుట్టినట్టు సామ్రాట్ తెలిపాడు. ఈ ఇండిపెండెన్స్ నాడు నా బిడ్డ రావడం, ఇలా సెలెబ్రేట్ చేయడం ఆనందంగా ఉందంటూ సామ్రాట్ తన బిడ్డను చూస్తూ ఎమోషనల్ అవుతున్న ఫోటోను షేర్ చేశాడు.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp