Bigg Boss 6 Telugu : రేవంత్ మొహం మాడిందిగా.. ఆరోహి ఆన్ ఫైర్
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం నామినేషన్ చిన్న పాటి యుద్దంగానే మారినట్టు కనిపిస్తోంది. ఈ రెండ్రోజులు అందరూ కూడా హాయ్ హాయ్ అంటూ బాగానే పలకరించుకున్నారు. కొందరు ఇంకొందరికీ నచ్చలేదు. అయినా అలానే ఉండిపోయారు. నామినేషన్ టైంలో చూసుకుందాంలే అన్నట్టుగా వదిలేశారు. ఇక ఫైమా లాంటిది అయితే.. నామినేషన్ ప్రక్రియ మీదే జోకులు వేసుకుంది. నామినేషన్ ప్రక్రియను ప్రాక్టీస్ చేసుకుంది. మొత్తానికి మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ఆన్ ఫైర్ అన్నట్టుగా సాగింది.దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇందులో రేవంత్ మొహం మాడిపోయినట్టుంది. ఆరోహి,ఫైమా దెబ్బ మీద దెబ్బ కొట్టేసినట్టు కనిపిస్తోంది. రేవంత్‌కు నోరు లేవకుండా చేసేశారు. మామూలుగానే రేవంత్ కాస్త యారంగెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు. తనది కాని విషయంలో దూరుతున్నాడు. అందరికీ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తాను చెప్పిందే వినాలి, అంతా తన ఇష్ట ప్రకారమే నడవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ నేచర్ ఇంట్లో వాళ్లకి నచ్చడం లేదు. దీంతో ఆ ఎఫెక్ట్ నామినేషన్ల మీద పడింది. ఫైమా, ఆరోహి వంటి వారు రేవంత్‌కు ఇచ్చి పడేశారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఫైమా వర్సెస్ రేవంత్, ఆరోహి వర్సెస్ రేవంత్ అన్నట్టుగా సాగింది. వాసంతి శ్రీ సత్యది చిన్న వార్‌లా అనిపించింది. కానీ రేవంత్ ఫైమా ఆరోహి మాత్రం అదరగొట్టేశారు. తమ తమ అభిప్రాయాలను గట్టిగా వినిపించారు. ఇంత వరకు ఓపిక పట్టాం అంటూ ఆరోహి తనలోని ఆగ్రహాన్ని బయటకు తీసుకొచ్చింది. నువ్ 2 మార్కుల ప్రశ్నకు 20 మార్కుల సమాధానం చెబితే.. నేను 20 మార్కుల ప్రశ్నకు 2000 మార్కుల సమాధానం చెబుతాం అంటూ రేవంత్‌కు ఎదురుతిరిగింది.
Modhati week nominate ayyedi evaru? ????
Watch the drama unfold on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#DisneyPlusHotstar #StarMaa pic.twitter.com/UR4qJrRYq4
— starmaa (@StarMaa) September 7, 2022