Bigg Boss Telugu : సీజన్ 8 ఇంకా మొదలవ్వలేదు..అప్పుడే ఆమెనే విన్నర్ అని ప్రకటించేశారుగా
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu : సీజన్ 8 ఇంకా మొదలవ్వలేదు..అప్పుడే ఆమెనే విన్నర్ అని ప్రకటించేశారుగా
Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో దూసుకుపోతుంది. ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో ఎనిమిదో సీజన్ జరుపుకోనుంది. ఇటీవల ప్రోమో విడుదల చేయగా, ఇది ఆకట్టుకుంది. ఈ లోగోతో అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ షోలో పాల్గొనే వారికి సంబంధించి ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లలో కుమారి ఆంటీ కూడా ఉన్న విషయం తెలిసిందే. తన వంటలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. స్టార్ మా కామెడీ షోలకు గెస్ట్‌లుగా వెళ్లింది.
Bigg Boss Telugu పెద్ద స్కెచ్చే..
ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ కావడంతో.. కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా తీసుకుంటున్నారు. ఆమె ఫైనల్ లిస్ట్‌లో ఉంటుందా? ఒకవేళ ఆమె హౌస్‌లోకి వెళ్తే ఒక వారం ఉంటుందా? తప్పితో రెండు వారాలు ఉంటుందా? అన్నది పక్కనపెడితే.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లకముందే పవన్ కళ్యాణ్ ఫొటోతో ప్రచారం మొదలుపెట్టేసింది కుమారి ఆంటీ. ఈ మధ్యన కుమారీ ఆంటీ ఏ ఇంటర్వ్యూ చూసినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటో కనిపిస్తోంది. బేసిక్ గా ఆమె పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇప్పుడు మరింత డోస్ పెంచింది. అందుకే ప్రతి ఇంటర్వ్యూలో పవన్ ఫొటో క్లారిటీగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Bigg Boss Telugu : సీజన్ 8 ఇంకా మొదలవ్వలేదు..అప్పుడే ఆమెనే విన్నర్ అని ప్రకటించేశారుగా
పవన్ ఫ్యాన్స్ ఆదరాభిమానాలు తనకు తోడైతే బిగ్ బాస్ హౌజ్ లో తనకు తిరుగుండదని కుమారీ ఆంటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు ఆమె పెద్ద స్కెచ్చే వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే.. ఇక తనకి తిరుగు ఉండదని ముందే ఊహించిన కుమారి ఆంటీ.. తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టేసింది. గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్ సింపథీ డ్రామా ఆడి కప్ గెలవగా, ఈ సారి కుమారి ఆంటీ పవన్ ఫొటోతో కప్ కొడుతుందని కొందరు
జోస్యాలు చెబుతున్నారు.