Father Risks Life : కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన తండ్రి.. బాహుబలి సీన్ రిపీట్.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Father Risks Life : కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన తండ్రి.. బాహుబలి సీన్ రిపీట్.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :2 August 2023,7:46 pm

Father Risks Life : మీకు బాహుబలి సినిమా గుర్తుందా అందులో.. మహేంద్ర బాహుబలి పుట్టగానే శివగామి ఆ బాలుడిని రక్షించడం కోసం తను నీటిలో మునిగి తన ఒంటి చేత్తో ఆ బాలుడిని పట్టుకుంటుంది. ఆ సీన్ ఇప్పుడు చూసినా ఒంటి మీద ఉన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ సీన్ బాహుబలి సినిమాకే హైలెట్. తాజాగా అలాంటి సీన్ ఒకటి రియల్ గా దర్శనం ఇచ్చింది. కాకపోతే ఓ తండ్రి చేసిన సాహసం అది అని చెప్పుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఓ తండ్రి చేసిన సాహసం అది. ప్రాణాలకు తెగించి మరీ తన కొడుకును చేతులతో పట్టుకొని వాగు దాటాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో చోటు చేసుకుంది. కెరమెరి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ రవి తన కొడుకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆ పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగాయి. దీంతో పలు గ్రామాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగిపోయాయి.అయితే.. లక్మాపూర్ గ్రామం నుంచి కెరమెరి మండల కేంద్రం వెళ్లాలంటే భారీ వర్షాల వల్ల ఉప్పొంగుతున్న ఆ వాగును దాటాల్సిందే. మెడ లోతు వరకు ఆ వాగు ప్రవహిస్తున్నా.. తన కొడుకును చేతులతో పైకి ఎత్తుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి కెరమెరిలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

father risks his life to save his son video viral

father risks his life to save his son video viral

Father Risks Life : వాగు దాటి కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లిన రవి

చికిత్స తర్వాత మళ్లీ అదే వాగు దాటి ఇంటికి చేరుకున్నాడు. నిజానికి ఆ గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జి కట్టేందుకు నిర్మాణం ప్రారంభించినా అది పూర్తి కాలేదు. దీంతో ఆ గ్రామం నుంచి ఎటు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా తన కొడుకుకి వైద్యం చేయించడం కోసం ఆ తండ్రి ఏకంగా అంత పెద్ద వాగునే దాటాల్సి వచ్చింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది