Laal Singh Chaddha : సినిమా విడుదలకు ముందు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. సినిమా విడుదల అవ్వక ముందే థియేట్రికల్ బిజినెస్.. నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని సినిమా విడుదల అయిన తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని సార్లు కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయన లాల్ సింగ్ చడ్డా ను విడుదలకు ముందు వరకు అద్భుతం అన్నట్లుగా చాలా మంది చూశారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఏమీ లేని చెత్త సినిమా అంటూ టాక్ వచ్చింది.
లాల్ సింగ్ చడ్డా విడుదలకు ముందు ప్రముఖ ఓటీటీ వారు డిజిటల్ రైట్స్ ను ఏకంగా వంద కోట్ల వరకు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమీర్ ఖాన్ ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేశాడట. అంతే కాకుండా సినిమా విడుదల అయిన ఆరు నెలల వరకు ఓటీటీ లో విడుదల చేయకూడదు అంటూ కండీషన్ పెట్టాడట. ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు ఓకే చెప్పి వంద కోట్లు ఇస్తామని అడిగినా కూడా ఆమీర్ ఖాన్ ఆ సమయంలో నో చెప్పాడట. సినిమా విడుదల తర్వాత అంతకు మించి మీరే ఇచ్చేందుకు వస్తారని ఆమీర్ ఖాన్ వారితో అని ఉంటాడు.
ఇప్పుడు పరిస్థితి ఏంటో అందరికి తెల్సిందే. ఆమీర్ ఖాన్ వెళ్లి ఆ ప్రముఖ ఓటీటీ వారిని అడిగినా కూడా వారు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం పాతిక కోట్లకు సినిమాను కొనుగోలు చేయమని అడిగినా కూడా వారు నో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆరు నెలల తర్వాత కాదు ఆరు వారాలు కాగానే స్ట్రీమింగ్ చేసుకోండి అంటూ లైన్ క్లీయర్ చేసినా కూడా మాకు వద్దు బాబోయ్ మీ సినిమా అంటూ ఆ ఓటీటీ వారు పారిపోయే పరిస్థితి ఉంది. తెలుగు లో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించిన లాల్ సింగ్ చడ్డా సినిమా మరీ ఇంతటి దారుణమైన పరాజయం పాలవుతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఇలాంటి సినిమాలకు ముందుగానే ఓటీటీ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.