Laal Singh Chaddha : అప్పుడు రూ.100 కోట్లు, ఇప్పుడు పాతిక కోట్లు ఆ సినిమా పరిస్థితి దారుణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Laal Singh Chaddha : అప్పుడు రూ.100 కోట్లు, ఇప్పుడు పాతిక కోట్లు ఆ సినిమా పరిస్థితి దారుణం

Laal Singh Chaddha : సినిమా విడుదలకు ముందు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. సినిమా విడుదల అవ్వక ముందే థియేట్రికల్‌ బిజినెస్‌.. నాన్ థియేట్రికల్‌ బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని సినిమా విడుదల అయిన తర్వాత నాన్ థియేట్రికల్‌ బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని సార్లు కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయన లాల్‌ సింగ్‌ చడ్డా ను విడుదలకు ముందు వరకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 August 2022,8:30 am

Laal Singh Chaddha : సినిమా విడుదలకు ముందు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. సినిమా విడుదల అవ్వక ముందే థియేట్రికల్‌ బిజినెస్‌.. నాన్ థియేట్రికల్‌ బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని సినిమా విడుదల అయిన తర్వాత నాన్ థియేట్రికల్‌ బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రం కొన్ని సార్లు కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయన లాల్‌ సింగ్‌ చడ్డా ను విడుదలకు ముందు వరకు అద్భుతం అన్నట్లుగా చాలా మంది చూశారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఏమీ లేని చెత్త సినిమా అంటూ టాక్ వచ్చింది.

లాల్ సింగ్ చడ్డా విడుదలకు ముందు ప్రముఖ ఓటీటీ వారు డిజిటల్ రైట్స్ ను ఏకంగా వంద కోట్ల వరకు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమీర్ ఖాన్‌ ఏకంగా 150 కోట్లు డిమాండ్‌ చేశాడట. అంతే కాకుండా సినిమా విడుదల అయిన ఆరు నెలల వరకు ఓటీటీ లో విడుదల చేయకూడదు అంటూ కండీషన్ పెట్టాడట. ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్‌ కు ఓకే చెప్పి వంద కోట్లు ఇస్తామని అడిగినా కూడా ఆమీర్ ఖాన్ ఆ సమయంలో నో చెప్పాడట. సినిమా విడుదల తర్వాత అంతకు మించి మీరే ఇచ్చేందుకు వస్తారని ఆమీర్‌ ఖాన్‌ వారితో అని ఉంటాడు.

Bollywood super star movie Laal Singh Chaddha ott rights interesting rumours

Bollywood super star movie Laal Singh Chaddha ott rights interesting rumours

ఇప్పుడు పరిస్థితి ఏంటో అందరికి తెల్సిందే. ఆమీర్‌ ఖాన్‌ వెళ్లి ఆ ప్రముఖ ఓటీటీ వారిని అడిగినా కూడా వారు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం పాతిక కోట్లకు సినిమాను కొనుగోలు చేయమని అడిగినా కూడా వారు నో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆరు నెలల తర్వాత కాదు ఆరు వారాలు కాగానే స్ట్రీమింగ్‌ చేసుకోండి అంటూ లైన్ క్లీయర్‌ చేసినా కూడా మాకు వద్దు బాబోయ్ మీ సినిమా అంటూ ఆ ఓటీటీ వారు పారిపోయే పరిస్థితి ఉంది. తెలుగు లో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా మరీ ఇంతటి దారుణమైన పరాజయం పాలవుతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఇలాంటి సినిమాలకు ముందుగానే ఓటీటీ బిజినెస్‌ చేస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది