Brahmamudi 21 Aug Episode Highlights : వర్షంలో తడిసి ముద్దయిన కావ్య.. రాజ్‌పై కనకం, మూర్తి సీరియస్.. కావ్యను తమ ఇంటికి తీసుకెళ్తారా?
Brahmamudi 21 Aug Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి సీరియల్ 21 ఆగస్టు 2023, సోమవారం ఎపిసోడ్ 180 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణి పంతం నెగ్గింది. తాను అనుకున్నది సాధిస్తుంది. అపర్ణకు కావ్య మీద చెప్పాల్సినవన్నీ చెబుతుంది. దీంతో కావ్య మీద కారాలు మిరియాలు నూరుతుంది. ఇక మనం వచ్చిన పని అయిపోయింది అనుకొని తిన్నగా రుద్రాణి అక్కడి నుంచి జారుకుంటుంది. సాయంత్రం కాగానే కావ్య ఇంటికి వస్తుంది. తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది అపర్ణ. నా కొడుకు గురించి ఏం అనుకుంటున్నావు.. ఎవరని అనుకుంటున్నావు. నా కొడుకు గురించి తెలిసే ఇలా వాడిని నీ స్థాయికి దగజార్చుతున్నావా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ.
దీంతో నాది అంత నీచపు స్థాయి కాదు కదా అత్తయ్య అంటుంది కావ్య. అసలు నేను ఏం నేరం చేశానో చెప్పు అని అడుగుతుంది కావ్య. దీంతో వాడితో ఎందుకు అడ్డమైన పనులు చేయిస్తున్నావు అని అడుగుతుంది. నీతో పాటు వాడిని మట్టి తొక్కించావా లేదా అని అడుగుతుంది. దీంతో రుద్రాణి, రాహుల్ చేసిన పని ఇదంతా అని అనుకుంటుంది కావ్య. అంతా మీరు చేసిందా అని అంటుంది. అసలు నేను చేసిన నేరం ఏంటి. రోజూ ఇంటికి రాగానే దోషిగా నిలబెట్టి ఈ రచ్చ ఏంటి. నా మానాన నేను వెళ్లి మా నాన్నకు సాయం చేసి వస్తుంటే ఇదంతా ఏంటి అని అడుగుతుంది కావ్య. దీంతో నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వాడిని తీసుకెళ్లి మట్టి పిసికిస్తారా అంటుంది అపర్ణ.
అసలు ఆ మీడియాకు వేరే పని పాట లేదా? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు. ఎందుకు ఇంటి వరకు ఇవన్నీ చేరవేస్తున్నారు. వరుసగా జరిగే ఈ గొడవలు అన్నింటికీ కారణమే మీరు, మీ కొడుకు అంటుంది కావ్య. కాదు అని ఇక్కడ ఉన్న వాళ్లను చెప్పమనండి అని ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో ఇక ఆపు అంటుంది అపర్ణ. ఎవరు నాకు చేరవేసినా అందులో ఉండే నిజా నిజాలు తెలుసుకోలేనంత మూర్ఖురాలిని కాదు అంటుంది అపర్ణ. నువ్వు మట్టిలో తైతక్కలాడినా నాకు అనవసరం కానీ.. నా కొడుకును పావుగా మార్చి నీ కుటుంబంలో కలిపి మట్టి తొక్కేలా చేస్తే నిన్ను క్షమించేదే లేదు అంటుంది అపర్ణ.
Brahmamudi 21 Aug Episode Highlights : మీ కొడుక్కి మీరు కన్న తల్లేనా అని ప్రశ్నించిన కావ్య
అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అత్తయ్య నేను డిజైన్స్ వేసి ఆ డబ్బు మా ఇంటికి తీసుకెళ్లి ఇస్తే మీకు నచ్చదు. మా ఆయన నన్ను సమర్థించినా మీకు నచ్చదు. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటారో అని భయం. ఎక్కడ మేమిద్దరం ఒక్కటైపోతామేమోనన్న భయం. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మీ కొడుక్కి మీరు భూతద్దంలో చూపించి నన్ను మాటలు అనే వరకు నిద్రపోరు. మీకు నేను ఎప్పటికీ కోడలుగా పనికిరాను. అందుకని మీ కొడుకుకి నేను భార్యగా పనికిరానా? మా ఇద్దరిని విడదీసి నన్ను బయటికి గెంటేసి మీ కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా? అసలు మీ కొడుక్కి మీరు కన్న తల్లేనా? అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.
ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి ఏమన్నావు అని తన చెంప పగులగొట్టబోతాడు రాజ్. మరోవైపు వర్షం వస్తోందని బొమ్మలు అన్నీ ఇంట్లో పెట్టాలని మూర్తి హడావుడి చేస్తుంటాడు. ఇంతలో కనకం వచ్చి బొమ్మలను ఇంట్లో పెట్టబోతుండగా ఇంతలో ఒక వినాయకుడి బొమ్మ కింద పడుతుంది. పాపం అమ్మాయి కష్టపడి రంగులు వేసింది. దేవుడి బొమ్మ కింద పడి పగిలిపోవడం అంటే నాకు ఏదో తేడా అనిపిస్తోంది అంటుంది కనకం. నా మనసుకు ఏదో చెడు జరగబోతోందనిపిస్తోంది అని అంటుంది కనకం. దీంతో నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. చెడు ఏం జరగదులే అని అంటాడు మూర్తి.
మా తాతయ్య నేర్పిన సంస్కారం గుర్తుంది కాబట్టి నువ్వు బతికిపోయావు అని అంటాడు రాజ్. ఏమన్నావు అంటే.. నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మగారికి ఇష్టం లేదు అంటే.. నువ్వు ఈ ఇంట్లో ఉండటం నాకూ ఇష్టం లేదు అంటాడు రాజ్. తనను తీసుకెళ్లి బయటికి గెంటేస్తాడు. దీంతో నేను ఎక్కడికి వెళ్లను. ఇక్కడే ఉంటా. ఇదే నా ఇల్లు అంటుంది. దీంతో తన ముఖం మీదే డోర్ వేస్తాడు రాజ్. వర్షం స్టార్ట్ అయినా కూడా అక్కడే ఉంటుంది కావ్య. దీంతో వర్షంలో తడిసి ముద్దవుతుంది.
కళ్యాణ్ చెప్పినా కూడా వినడు రాజ్. వర్షంలో కావ్య తడుస్తోంది అన్నా కూడా రాజ్ వినడు. ఇంతలో ఆటోలో అక్కడికి వస్తారు మూర్తి, కనకం. వర్షంలో తడుస్తున్న తన కూతురును చూసి బోరున విలపిస్తారు. ఇంత దుర్మార్గమా.. పదా అని తనను ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.