Brahmamudi 2 Aug Today Full Episode : ఇల్లు అమ్మేందుకు సిద్ధమైన కృష్ణమూర్తి.. కావ్యకు 50 వేలు ఇచ్చిన రాజ్.. వాటితో వడ్డీ కట్టేస్తుందా.. ఇంటి సమస్య తీరుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmamudi 2 Aug Today Full Episode : ఇల్లు అమ్మేందుకు సిద్ధమైన కృష్ణమూర్తి.. కావ్యకు 50 వేలు ఇచ్చిన రాజ్.. వాటితో వడ్డీ కట్టేస్తుందా.. ఇంటి సమస్య తీరుతుందా?

Brahmamudi 2 Aug Today Full Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఆగస్టు 2023, బుధవారం ఎపిసోడ్ 164 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్.. కావ్యకు డబ్బుల గురించి చెప్పడంతో కావ్య టెన్షన్ పడుతుంది. అసలు కావ్యతో కళ్యాణ్ ఏం మాట్లాడాడు అని అడుగుదాం అని అనుకుంటాడు రాజ్. కానీ.. తనను అడిగితే ఏం లేదు అంటుంది. వెళ్లి కళ్యాణ్ ను అడుగుతాడు రాజ్. దీంతో తన […]

 Authored By gatla | The Telugu News | Updated on :2 August 2023,8:00 am

Brahmamudi 2 Aug Today Full Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఆగస్టు 2023, బుధవారం ఎపిసోడ్ 164 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్.. కావ్యకు డబ్బుల గురించి చెప్పడంతో కావ్య టెన్షన్ పడుతుంది. అసలు కావ్యతో కళ్యాణ్ ఏం మాట్లాడాడు అని అడుగుదాం అని అనుకుంటాడు రాజ్. కానీ.. తనను అడిగితే ఏం లేదు అంటుంది. వెళ్లి కళ్యాణ్ ను అడుగుతాడు రాజ్. దీంతో తన ఇంటి సమస్య గురించి చెబుతాడు. అర్జెంట్ గా 50 వేలు కావాలంట. ఎవరికో ఇవ్వాలంట అని చెబుతాడు. నేను ఇస్తా అన్నా కూడా వద్దు అని చెప్పింది అంటాడు కళ్యాణ్. మరోవైపు రాత్రి పేపర్స్ మీద పిచ్చి పిచ్చిగా ఏదో గీస్తూ ఉంటుంది కావ్య. జ్యూవలరీకి డిజైన్ కాకుండా ఏదేదో గీస్తుంది. రాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్. అసలు నీ సమస్య ఏంటి అని అడుగుతాడు కానీ.. ఏం సమాధానం చెప్పదు. నాకు నిద్ర వస్తోంది. నేను పడుకుంటా అంటుంది.

brahmamudi 02 august 2023 wednesday 164 full episode

మరోవైపు కిచెన్ లో పని చేస్తూ ఉంటుంది. ఈరోజు మార్వాడి వాడు వస్తాడేమో అనుకొని ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. అందరికీ కాఫీలు తీసుకెళ్లి అందరికీ ఏం ఇవ్వాలో అది ఇవ్వకుండా.. కప్పులు మార్చేస్తుంది. అందరి కప్పులు మారడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటమ్మా.. నువ్వు ఇక్కడున్నా నీ మనసు ఎక్కడో ఉన్నట్టు ఉంది. ఏమైంది నీకు అని అడుగుతుంది అమ్మమ్మ. ఏం లేదు అంత బాగానే ఉంది అంటుంది. బాగున్నప్పుడు ఇలా ఎలా తప్పు జరుగుతుంది. భయం, భక్తి ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి అంటుంది అపర్ణ. దీంతో సారీ అత్తయ్య. తప్పు నాదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. ఇవన్నీ పై నుంచి రాజ్ చూస్తుంటాడు.

మరోవైపు కృష్ణమూర్తి ఇల్లు అమ్మాలా వద్దా అనే టెన్షన్ లో ఉంటాడు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వడ్డీనే కట్టలేకపోతున్నాం. ఇక అసలు ఎలా కడతాం అని కనకంతో అంటాడు మూర్తి. ఇల్లు అమ్మేద్దాం. అంతకు మించి మనకు మరో దారి లేదు అంటాడు మూర్తి. మనసుతో ఆలోచిస్తే ఆ పని చేయలేను. మనలాంటి మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అంటే జీవితాశయం లాంటిది. ఈ ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టుకున్నా. ఏరోజూ దీన్ని ఒక ఆస్తిలా చూడలేదు. దీనికి కూడా ఒక ప్రాణం ఉంది అని చూసేవాడిని. బయట ఎన్ని సమస్యలు వచ్చినా ఇంటికి రాగానే ఒక ధైర్యం వచ్చేది. కానీ.. ఇప్పుడు ఆ ధైర్యాన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇంటిని దూరం చేసుకుంటే ఎన్నో మెమోరీస్ దూరం అవుతాయి. దేవుడు నాకు అవన్నీ దూరం చేస్తున్నాడు. అందుకే ఆ సీతారామ్ కే ఆ ఇల్లు ఇచ్చేద్దామని అనుకుంటున్నా అంటాడు.

Brahmamudi 2 Aug Today Full Episode : ఇల్లు అమ్మకుండా ఆపాలని నిర్ణయం తీసుకున్న కనకం

మనిషికి కష్టం అంటే సాయం చేయాలి కానీ.. అవకాశం దొరికింది కదా అని మోసం చేస్తారు అంటుంది కనకం. ముందు మనం ఈ సమస్య నుంచి బయటపడాలి. అతడు 22 లక్షలు ఇస్తా అన్నాడు కదా. ముందు బాకీ తీర్చేసి మిగిలిన డబ్బుతో అప్పు పెళ్లి చేయాలి అని అంటాడు. మరి ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. దీంతో మనం ఎలాగోలా బతికేద్దాం అంటాడు కృష్ణమూర్తి. సరే.. ఆ సీతారామ్ ని పిలుస్తా. ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. దీంతో టీ పాయ్ మీద ఉంది అంటుంది. ఈ ఇల్లు అమ్మకుండా ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకుంటుంది కనకం.

మరోవైపు ఆఫీసుకు బయలుదేరుతాడు రాజ్. ఇదుగోండి అని జ్యుయలరీ డిజైన్స్ గీసి తీసుకొస్తుంది. వాటిని రాజ్ కి ఇస్తుంది. బాగున్నాయి అంటాడు. క్లయింట్స్ కి వివరించాలి కదా. నువ్వు ఆఫీసుకు వస్తున్నావా అంటే.. నేను రాలేను పని ఉంది అంటుంది కావ్య. దీంతో ఒక్క నిమిషం అని చెప్పి బీరువాలో డబ్బులు తీసి రూ.50 వేలు ఇస్తాడు. ఇదిగో తీసుకో అంటాడు. ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు ఫ్రీగా డిజైన్స్ వేస్తే నాకు అవసరం లేదు అంటాడు. దీంతో అప్పుడు ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. ఆ తర్వాత రూ.50 వేలు తీసుకుంటుంది.

ఆ వడ్డీ డబ్బులు ఇచ్చేయొచ్చు అని సంబుర పడుతుంది కావ్య. మరోవైపు ఏదో కోరియర్ వస్తుంది కావ్యకు. ఒక లెటర్, ఫ్లవర్ బాట్ కూడా వస్తుంది. కానీ.. అది చూస్తే కళ్యాణ్ కు వస్తుంది. అభిమాన పాఠకురాలు పంపిస్తుంది. పూలకుండితో పాటు లెటర్ కూడా పంపిస్తుంది ఆ అమ్మాయి. ఒక్క కవితకే నా కొడుకు సెలబ్రిటీ అయ్యాడని సంబురపడుతుంది. ఇంట్లో వాళ్లు అంతా సంబుర పడుతారు. అసలు ఎంత సెలబ్రిటీ అయ్యారో ఈ లెటర్ చదివితే తెలుస్తుంది కదా అంటుంది కావ్య. దీంతో వద్దు వదిన అంటాడు కళ్యాణ్.

ప్లీజ్ వదిన.. వద్దు వదిన అంటాడు. కానీ.. నేను చదువుతా అంటుంది. నేను అస్సలు ఇవ్వను అంటుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది