Brahmamudi Serial Today April 14th Episode : అపర్ణకు రాజ్‌ను చూపిస్తానన్న కావ్య.. కాకపోతే కండిషన్‌పై
ప్రధానాంశాలు:
Brahmamudi Serial Today April 14th Episode : అపర్ణకు రాజ్‌ను చూపిస్తానన్న కావ్య.. కాకపోతే కండిషన్‌పై
Brahmamudi Serial Today April 14th Episode : స్టార్ మాలో టాప్ రేటింగ్స్‌తో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఏప్రిల్ 14వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య క్లైంట్స్ తో మాట్లాడి 24 గంటల లోపల బిల్లు క్లియర్ చేస్తాను అని చెబుతుంది. తర్వాత అప్పు.. కావ్య కోసం ఎదురు చూస్తుండగా కావ్య రావడంతో నీకోసమే ఎదురు చూస్తున్నాను అక్క అంటుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బావ కోసం ఎదురు చూస్తూ ఏమి తీసుకోవడం లేదు. ఇలాగే ఉంటే ఆమె పరిస్థితి మరింత దారుణంగా అవుతుంది అంటుంది.

Brahmamudi Serial : అపర్ణకు రాజ్‌ను చూపిస్తానన్న కావ్య.. కాకపోతే కండిషన్‌పై
బావని ఎప్పటికైనా తీసుకొస్తావని నువ్వు, ఎలాగైనా తన కొడుకు వస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఏదో ఒకటి ఆలోచించు అక్క అని అంటుంది అప్పు. రేపు అత్తయ్య పుట్టినరోజు. ప్రతి సంవత్సరం పెద్ద అత్తయ్య పుట్టినరోజునే బావ సెలబ్రేట్ చేసేవారు. కానీ ఈసారి బావలేడన్న బాధతో అత్తయ్య ఆ విషయం గురించి అసలు పట్టించుకోవడమే లేదు. అన్నదానం చేస్తామన్నా కూడా వద్దని వెళ్లిపోయింది అంటుంది అప్పు. దాంతో అపర్ణ దగ్గరకు వెళ్లి కావ్య ఇలా అంటుంది. ఎన్నాళ్లుగా చీకట్లో ఉంటారు అంటే, వెలుతురులోకి రావడానికి నా కొడుకు నా దగ్గర లేడు కదా అని అంటుంది అపర్ణ. నన్ను ఇలాగే వదిలేయ్ ఏమీ మాట్లాడకు అంటుంది. దాంతో ఎందుకు వదిలేయాలి, ఎన్నాళ్లు ఇలా వదిలేయాలి అంటూ ఆయన బ్రతికే ఉన్నాడు అంటే ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నిస్తుంది కావ్య.
Brahmamudi Today Episode
ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు. మాకు ఎందుకు అనిపించడం లేదు. ఇంటికి ఎందుకు రావడం లేదు అంటుంది అపర్ణ. దాంతో ఆయన గతం మర్చిపోయాడు కాబట్టి అని గట్టిగా అరుస్తుంది కావ్య. అసలు విషయం చెప్పడంతో అపర్ణ షాక్‌కు గురై అదే సమయంలో ఆనందపడుతూ ఉంటుంది. అసలు విషయం చెబితే ఆయనతో మాట్లాడకుండా, కలవకుండా ఉండలేరు. అందుకే ఇన్నాళ్లు చెప్పలేదు అంటుంది కావ్య. అయితే ఆయనకు గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తే ఆయన మళ్లీ మనకు దూరం అవుతాడు అనడంతో అపర్ణ షాక్ గురైతుంది.సరే కావ్య రాజ్ బతికే ఉన్నాడు అంటున్నావ్. కాబట్టి వాడిని ఒకసారి నాకు చూపించు అని బ్రతిమలాడంతో చూపిస్తాను, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని అపర్ణ దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆయన చేతుల మీదగా నేను అన్నదానం జరిపిస్తాను. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మీరు ఆయనను చూడొచ్చు చెబుతుంది.
ఆయనని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇంతలోనే రాజ్ కావ్యకు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ ఎత్తి కావ్య కావాలనే రాజ్‌తో వెటకారంగా మాట్లాడుతుంది. తర్వాత ఇద్దరు కలవాలని అనుకుంటారు. కూరగాయల మార్కెట్‌లో కలవాలని అనుకుంటారు. కావ్య కావాలనే రాజ్‌తో కామెడీ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే బయల్దేరుతున్నా అని రాజ్ అనడంతో తాను కూడా బయల్దేరుతున్నా అని చెప్పడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.