Anasuya : అనసూయ అరుపులు.. పారిపోయిన బ్రహ్మానందం

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 7:40 pm

Anasuya : బుల్లితెరపై అనసూయ, సుధీర్ అంటే అందరికీ జబర్దస్త్, మల్లెమాల గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా స్టార్ మా చానెల్‌కు జంప్ చేశారు. సూపర్ సింగర్ జూనియర్స్ అనే షోకు వెళ్లారు. మల్లెమాల నుంచి వీరు ఎందుకు బయటకు వచ్చారో తెలియదు. సరైన కారణాలు కూడా చెప్పడం లేదు. ఎప్పటి నుంచో బయటకు వెళ్లాలని చూస్తున్నాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. కొన్ని ఇబ్బందులు పడ్డాను అంటోంది. ఇలా అనసూయ ఏవేవో కారణాలు చెప్పేసింది. అయితే అనసూయ తాను జబర్దస్త్ వీడటంపై కనీసం నోరు విప్పింది. కానీ సుధీర్ మాత్రం ఇంత వరకు కూడా ఎక్కడా స్పందించలేదు.

ఇక ఈ ఇద్దరూ కలిసి షోను బాగానే రన్ చేస్తున్నారు. కానీ టీఆర్పీ రేటింగ్స్ మాత్రం రావడం లేదు. సూపర్ సింగర్ జూనియర్స్‌లోని పిల్లలు మాత్రం తమ గాత్రాలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసేస్తున్నారు. మయూక్, సుధీక్షలకు ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది. వచ్చే వారం ఈ షో ఫినాలే ఎపిసోడ్ జరగబోతోంది. దీనికి కామెడీ కింగ్ బ్రహ్మానందం, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా వచ్చారు. అయితే స్టేజ్ మీదకు బ్రహ్మానందం రాగానే..

Brahmanandam in Anasuya star maa super singer junior show

Brahmanandam in Anasuya star maa super singer junior show

వెల్కమ్ టు బ్రహ్మానందం గారు అంటూ అనసూయ అరిచేసింది. ఆమె అరుపుల దెబ్బకు బ్రహ్మానందం పారిపోయాడు. దెబ్బకు సుధీర్ వెనకాలకు వచ్చాడు. అదేంట్రా నేను పక్కనే ఉన్నాను కదా? అలా అరిచిందేంటి? అని కౌంటర్ వేశాడు. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది సర్ అని సుధీర్ అంటే.. అలా కాకుండా ఎలా అంటావ్.. మీరు రావడం చాలా దారుణంగా ఉంది అని అనలేవు కదా? అని మరో కౌంటర్ వేశాడు బ్రహ్మానందం. మొత్తానికి చాలా రోజుల తరువాత ఇలా బ్రహ్మానందం ఓ షోకు స్టేజ్ మీదకు వచ్చాడు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp