Samantha : బంపర్ ఆఫ‌ర్.. స‌మంత ద‌గ్గ‌ర జాబ్ చేయాల‌ని ఉందా.. వెంట‌నే ఈ ప‌ని చేయండి! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : బంపర్ ఆఫ‌ర్.. స‌మంత ద‌గ్గ‌ర జాబ్ చేయాల‌ని ఉందా.. వెంట‌నే ఈ ప‌ని చేయండి!

Samantha  : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. నాగ చైత‌న్యని పెళ్లి చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. కాని కొన్ని సంవ‌త్స‌రాల‌కే అత‌నికి బ్రేక‌ప్ చెప్పి సోలోగా ఉంటుంది. విడాకుల త‌ర్వాత స‌మంత యశోద, శాకుంతలం చేసింది. అనంత‌రం విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : బంపర్ ఆఫ‌ర్.. స‌మంత ద‌గ్గ‌ర జాబ్ చేయాల‌ని ఉందా.. వెంట‌నే ఈ ప‌ని చేయండి!

Samantha  : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. నాగ చైత‌న్యని పెళ్లి చేసుకొని అక్కినేని కోడ‌లిగా మారింది. కాని కొన్ని సంవ‌త్స‌రాల‌కే అత‌నికి బ్రేక‌ప్ చెప్పి సోలోగా ఉంటుంది. విడాకుల త‌ర్వాత స‌మంత యశోద, శాకుంతలం చేసింది. అనంత‌రం విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేసింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక మ‌యోసైటిస్ వ‌ల‌న సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా త‌న ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు పూర్తిగా కోలుకోవ‌డంతో తిరిగి సినిమాలు చేస్తుంది.

Samantha  : స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం

ఇటీవ‌ల ఈ స్టార్ లేడీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది.ఈ సినిమాతో సమంత నిర్మాతగా కూడా మారడం విశేషం. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. మొదటి ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ చేస్తుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో సమంతనే హీరోయిన్. బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. ఎర్ర చీర కట్టుకొని, చేతిలో తుపాకీ పట్టుకొని వీరనారి గెటప్ లో సమంత మైండ్ బ్లాక్ చేసింది. ఈ సినిమాతో స‌మంత ప్రేక్ష‌కుల‌ని మరింత అల‌రించ‌బోతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. అయితే ఆమె ప్రధాన పాత్ర చేసిన వెబ్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ సమంత కు జంటగా నటిస్తున్నాడు. ఇది హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్. ఇది త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

Samantha బంపర్ ఆఫ‌ర్ స‌మంత ద‌గ్గ‌ర జాబ్ చేయాల‌ని ఉందా వెంట‌నే ఈ ప‌ని చేయండి

Samantha : బంపర్ ఆఫ‌ర్.. స‌మంత ద‌గ్గ‌ర జాబ్ చేయాల‌ని ఉందా.. వెంట‌నే ఈ ప‌ని చేయండి!

అయితే సమంత సినిమాలు చేస్తూనే బిజినెస్‌పై కూడా దృష్టి పెడుతుంది. ఆమె సాకి పేరుతో గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే . ఈ సంస్థలో పని చేసేందుకు తాజాగా ఉద్యోగ ప్రకటన చేసింది సమంత. తగు అర్హతలు ఉన్నవాళ్లు వివరాలు పంపాలని ప్రకటించింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కొరకు ఆమె అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు కోరింది. ప్రకటనలో పొందు పరిచిన ఈ మెయిల్ అడ్రస్ కి వివరాలు పంపాలని వెల్లడించారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం త్వ‌ర‌గా అప్లై చేసుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది