Adipurush : ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి మరొక పిడుగు లాంటి వార్త
Adipurush : ప్రస్తుతం దేశమంతా ఒకే సినిమా గురించి చర్చిస్తోంది. అదే ఆదిపురుష్. నిజానికి ఆదిపురుష్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ.. ఎప్పుడైతే సినిమా టీజర్ ను రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాపై ఉన్న అంచనాలు కాస్త తగ్గిపోయాయి. అసలు ఇదేం యానిమేషన్. కార్టూన్ షోలా ఉంది టీజర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. మీమ్స్ వచ్చాయి. అయితే.. ఆదిపురుష్ సినిమా త్రీడీ స్క్రీన్ల కోసం తీసిందని.. సాధారణ స్క్రీన్ మీద చూస్తే అలాగే ఉంటుందని మూవీ యూనిట్ చెప్పిన విషయం తెలిసిందే.
అందుకే.. కొన్ని చోట్ల త్రీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి మరీ ఆదిపురుష్ టీజర్ ను చూపించారు. అయితే.. త్రీడీలో చూస్తే టీజర్ బాగానే ఉన్నప్పటికీ.. సినిమాలోని గెటప్స్ మాత్రం మారవు కదా. అవి అలాగే ఉంటాయి కదా. ముఖ్యంగా ఆ సినిమాలోని రాముడు, హనుమంతుడు, రావణుడి గెటప్స్ పై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ వాదులు, ఇతర సంస్థలు ఆ సినిమాపై పలు రకాల అభ్యంతరాలు తెలిపారు. కేసులు కూడా నమోదు చేశారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ కోర్టులోనూ ఆదిపురుష్ మూవీ టీమ్ పై కేసు నమోదు అయింది. జాన్పూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశుతోష్ సింగ్..
Adipurush : ఆదిపురుష్ టీమ్ తో పాటు ప్రభాస్, ఓం రౌత్ లపై కేసులు నమోదు
ఆదిపురుష్ టీమ్ తో పాటు, ప్రభాస్, ఓం రౌత్ లపై కేసు నమోదు చేశారట. హిమన్షు శ్రీవాస్తవ అనే అడ్వకేట్ కేసు నమోదు చేశారట. దీంతో వాళ్ల మీద కేసులు వేసినట్టు తెలుస్తోంది. సినిమాలోని ఏ ఒక్కరి పాత్ర కూడా సరిగ్గా లేదని అంటున్నారు. దీంతో సినిమాలో అందరి గెటప్స్ ను మార్చుతారా? లేక వీఎఫ్ఎక్స్ ను కూడా మార్చుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదదు. కానీ.. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా మీద పూర్తిగా నెగెటివ్ టాక్ నడుస్తుండటంతో మూవీ యూనిట్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదట. చివరకు సినిమా టీమ్ పై కేసులు కూడా నమోదు కావడంతో మూవీ యూనిట్ సినిమా విడుదలపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.