Bigg Boss OTT : బిగ్‌బాస్ ఓటీటీ ..కాస్త కన్ఫ్యూజన్, కాని ముందు ముందు రచ్చ ఖాయం ఇదే సాక్ష్యం
Bigg Boss OTT : గత ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినప్పటి నుండి ఇప్పటి వరకు బిగ్ బాస్ ఓటీటీ గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో ని స్ట్రీమింగ్ చేస్తామా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా ఎట్టకేలకు బిగ్ బాస్ ఓటీటీ మొదలైంది. అత్యంత భారీ స్థాయి లో ఈ షో నిర్వహించ బోతున్నట్లుగా నిర్వాహకులు గతం లో ప్రకటించారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం కాస్త విమర్శలు తప్పడం లేదు. గతంలో వచ్చిన కంటెస్టెంట్స్ పర్వాలేదనిపించినా కొత్త గా తీసుకున్న ఏ ఒక్కరు కూడా పెద్దగా గుర్తింపు వున్న వాళ్ళు కాదు. దాంతో వారు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూన్న ఈ షో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఓటీటీ లో ఎప్పుడు కూడా లైవ్ ఉంటుంది. అయితే ఇది కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కంటిన్యూగా చూస్తే ఎలా… అసలు ఈ షో ఫార్మాట్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. అయితే లైవ్ మాత్రమే కాకుండా ప్రతి రోజు గంట లేదా రెండు గంటల ఎడిటింగ్ వర్షన్ ని కూడా రాత్రి సమయంలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. కనుక లైవ్ చూడటం మాత్రమే కాకుండా ఎడిటెడ్ వర్షన్ ని కూడా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలి అంటూ నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ షో విషయమై ప్రస్తుతం కు కన్ఫ్యూజన్ ఉన్నా ముందు ముందు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుందని మొదటి రోజు రాత్రి జరిగిన సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. అప్పుడే హడావుడి మొదలైంది. ముమైత్ ఖాన్ మరియు సరయు వంటి వారు ఈ షోలో ఉండడం వల్ల యూత్ ఆడియన్స్ కి మంచి మసాలా స్టఫ్ దొరికే అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయని ఇప్పటికే తేలిపోయింది. సరికొత్త బిగ్ బాస్ ని సరి కొత్తగా చూసేందుకు ప్రేక్షకులు సిద్దం కావాలి. ఇన్నాళ్లు చూసిన ఫార్మట్ కాదు కనుక కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. కాని ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్ కనుకు రచ్చ రచ్చ మసాలా కంటెంట్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.